ఎంజీఆర్.. తమిళ సినీ - రాజకీయ ప్రస్థానంలో చెరగని ముద్ర వేసిన మహా వ్యక్తి. ఇప్పుడున్న అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఈయనే.. 1977 నుంచి 1987 వరకు తమిళనాడు సీఎంగా పనిచేశారు. తెలుగులో ఎన్టీఆర్ లాగానే ఎంజీఆర్ సినిమా జీవితంలోంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫుల్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఇంతటి మహా మనిషి జీవితాన్ని బయోపిక్ గా తీయాడానికి రంగం సిద్ధమైందా.? తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ గా తీస్తున్న ‘ఎన్.జీ.కే’ మూవీ ఎంజీఆర్ బయోపికేనా.? అన్న సందేహాలు తమిళ సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి..
ఎంజీఆర్ జీవితచరిత్రను బేస్ చేసుకొని చేస్తున్న సినిమానే ‘ఎన్.జీ.కే’ అని చెన్నైలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే టైటిల్ కూడా అలా అర్థం వచ్చేలా పెట్టారంటున్నారు. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో సూర్య - ఆయన భార్యగా సాయిపల్లవి నటిస్తోందని తెలుస్తోంది.
ఒక ఎంజీఆర్ కు సన్నిహిత శిష్యురాలు.. మాజీ ముఖ్యమంతి జయలలిత పాత్ర ఈ సినిమాలో చాలా కీలయం.. అన్నాడీఎంకేను ఇంత స్థితికి చేర్చి ముఖ్యమంత్రిగా రాణించింది జయలలిత.. ఆ పాత్రలో టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇది ఎంజీఆర్ జీవితం ఆధారంగానే తెరకెక్కుతోందని.. బయటకు వస్తే రాజకీయంగా ఇబ్బంది అనే చెప్పడం లేదని టాక్.. మరి సినిమా విడుదలైతే ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి..