ర‌కుల్ బుగ్గ‌లు పెంచిందా?!

Update: 2015-11-28 07:30 GMT
వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ఎదుర‌వుతున్న‌ప్పుడు ఎవ్వ‌రైనా డీలా ప‌డిపోతారు. ఆ ఎఫెక్ట్ మొహంలో స్ప‌ష్టంగా కొట్టొచ్చిన‌ట్టు క‌న‌బ‌డుతుంటుంది. ఒక్క‌సారిగా అభ‌ద్ర‌తాభావం వ‌చ్చేసి ఉన్న గ్లామ‌ర్ అంతా వెళ్లిపోయిన‌ట్టు అనిపిస్తుంది. కానీ క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్ విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌డం లేద‌నిపిస్తోంది. ఏంటో మరి.. ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర‌వుతున్నా ఆమె అందం రోజు రోజుకీ పెరుగుతోంది. బ‌హుశా వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతున్న అవ‌కాశాలు ఇస్తున్న ధైర్య‌మేమో.

నిన్న మొన్న‌టిదాకా స‌న్న‌గా ఇంతే మొహంతో క‌నిపించిన ర‌కుల్ ఇప్పుడు ఒక్క‌సారిగా ఛ‌బ్బీ గర్ల్ త‌ర‌హాలో క‌నిపిస్తోంది. బుగ్గలు పెంచి కొత్త అందం సంత‌రించుకుంది. సైజ్‌ జీరో సెల‌బ్రిటీ షోకి ఆమె హాజ‌రైంది. చాలా మంది హీరోయిన్లు ఆ షోకి వ‌చ్చారు. అయితే వారంద‌రిలోకంటే ర‌కుల్ ప్రీత్‌ సింగే హైలెట్‌ గా క‌నిపించింది. మంచి ఫ్యాష‌న్ దుస్తులు వేసి క‌త్తిలా కనిపించింది ర‌కుల్‌. ఆమె ఫేస్‌ లో కొత్త గ్లామ‌ర్ క‌నిపిస్తోంది. మునుప‌టికంటే అందంగా ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో అక్క‌డున్న సెల‌బ్రిటీలంతా కూడా ర‌కుల్ గురించే మాట్లాడుకోవ‌డం క‌నిపించింది.
 
ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌ - అల్లు అర్జున్‌ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో న‌టిస్తున్న ఆమె ఇటీవల వ‌రుణ్‌ తేజ్‌ లాంటి యువ హీరోతోనూ క‌లిసి న‌టించే అవకాశాన్ని చేజిక్కించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి కాన్ఫిడెన్స్‌ నే మెంటైన్ చేస్తే ర‌కుల్‌ కి ఇక తిరుగుండ‌ద‌ని చెప్పొచ్చు.  పండ‌గ చేస్కో - బ్రూస్‌ లీ - కిక్ 2 చిత్రాల‌న్నీ ర‌కుల్‌ కి చేదు ఫ‌లితాల్నే ఇచ్చాయి. అయితే ఆ సినిమాలు స‌రైన ఫ‌లితాన్నివ్వ‌లేక‌ పోయుండొచ్చు కానీ ర‌కుల్‌ ని మాత్రం అదిరిపోయేలా ప్ర‌జెంట్ చేశాయి. అందుకే ర‌కుల్‌ పై మాత్రం ఫెయిల్యూర్స్ తాలుకూ ప్ర‌భావం అస్స‌లు ప‌డ‌లేదు.
Tags:    

Similar News