రకుల్‌ జీ.. అసలు స్టోరీ అదేనా??

Update: 2016-06-07 13:48 GMT
హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మొన్న 'సైమా 2016' ప్రెస్‌ మీట్‌ కు ఎందుకు రాలేదు? ఇదే ప్రశ్నకు ఆన్సర్ గా.. నాటి 2016 ఉత్సవాలకు వెళ్ళినప్పుడు అమెరికాలో ఆమె కాలుకి గాయం అయ్యింది.. అందుకే రాలేదు.. అంటూ ఆమె పి.ఆర్. స్వయంగా ఒక నేషనల్ పేపర్ కు న్యూస్ ఇచ్చారు. బాగానే ఉంది. అయితే ''ధృవ'' షూటింగ్‌ లో పాల్గొనకుండా.. ఇప్పుడు రకుల్‌ ఏం చేయబోతోంది అని అందరూ ఆలిచిస్తుంటే.. అమ్మడు మాంచి ట్విస్టే ఇచ్చింది.

అదిగో ఈరోజు 'ఫిలింఫేర్‌' అవార్డుల ప్రెస్ మీట్‌ కార్యక్రమానికి విచ్చేసింది రకుల్‌. అమ్మడు వస్తూనే మాంచి స్మయిల్‌ ఇస్తూ అందరినీ పలకరించింది. చూస్తుంటే ఆమె కాలు కూడా బాగానే ఉందే అనిపించింది. ఇప్పుడు అందరికీ ఒక విషయం వెలిగింది. మొన్న ఒకవేళ కాలు బాగుండి సైమా అవార్డుల ప్రెస్ మీట్‌ కు వచ్చుంటే.. ఇవాళ ఫిలింఫేర్‌ కు ఈమెను పిలిచేవారే కాదు. అంటే.. ఒకవేళ.. అసలు సైమా కంటే ఫిలింఫేర్‌ వారు ఎక్కువగా పేమెంట్‌ ఇస్తారు కాబట్టే.. ఆ ప్రెస్ మీట్‌ కు డుమ్మా కొట్టేసి ఇక్కడ ఫిలింఫేర్‌ లో మెరిసిందా? అసలు స్టోరీ అదేనా?

సర్లేండి.. ఈ అవార్డుల కార్యక్రమాలు ఆర్గనైజర్లు కూడా కోట్ల రూపాయలు సంపాదించడానికేగా ఈ ఫంక్షన్లు చేసేది.. అలాంటప్పుడు రకుల్‌ మాత్రం పేమెంట్‌ ఎవరు ఎక్కువిస్తున్నారు అనే విషయం చూసుకుంటే అసలు తప్పే లేదు. రకుల్‌ జీ.. క్యారీ ఆన్!!
Tags:    

Similar News