21న మెగా లీగ్‌ లోకి రకూల్‌ ఎంట్రీ

Update: 2015-08-18 13:32 GMT
ఇలియానా వెళ్లాక ఆ ప్లేస్‌ని ఎవరు రీప్లేస్‌ చేస్తారు? అని బెంగ పెట్టుకున్నాం. ఫర్వాలేదు నేనున్నా అంటూ లీగ్‌ లోకి వచ్చింది రకూల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ పంజాబీ బొమ్మ వస్తూనే వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ తో హిట్‌ కొట్టింది. ఆరంభం చిన్నా చితకా హీరోల సరసన నటించింది. సందీప్‌ - మనోజ్‌ - ఆది వంటి హీరోలతో కెరీర్‌ బండి ప్రారంభించి, ఒకేసారి మాస్‌ మహరాజ్‌ రవితేజ సరసన అవకాశం అందుకుంది.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలోని కిక్‌2లో బిగ్‌ ఛాన్స్‌ పట్టేసింది. ఆ తర్వాత ఏకంగా మెగా హీరోలే ఈ అమ్మడి వెంటపడ్డారు. చరణ్‌ - బన్ని - ఎన్టీఆర్‌ లాంటి స్టార్ల సరసన అవకాశం అందుకుంది. అయితే ఈ అమ్మడు మెగా లీగ్‌ లో ప్రవేశించాక తొలి పెద్ద రిలీజ్‌ మాస్‌ రాజా కిక్‌ 2 నే. ఆగష్టు 21న ఈ సినిమా రిలీజవుతోంది.    బహుశా ఈ సినిమా హిట్టయితే ఇక లీగ్‌ లో టాప్‌ పొజిషన్‌ కోసం పోటీపడుతున్నట్టే. రకూల్‌ కెరీర్‌ లో తొలి పెద్ద హీరో రవితేజ. ఆ తర్వాత చరణ్‌, ఎన్టీఆర్‌, బన్నీ లైన్‌ లో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలకు సంతకాలు చేసి మెగా కాంపౌండ్‌ కి దగ్గరైపోయింది కాబట్టి ఇక నుంచి అదే ఫ్యామిలీ హీరోలతో వరుసగా సంతకాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అయితే అలా కొనసాగాలంటే ఇప్పుడు కిక్‌2 హిట్టు కొట్టడం చాలా అవసరం. విజయం ధీమానిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో అయితే కోట్ల రూపాయల పారితోషికాన్ని, మెగా ఛాన్సుల్ని ఇస్తుంది. ఇప్పుడు రకూల్‌ కి సిసలైన సక్సెస్‌ చాలా ఇంపార్టెంట్‌.
Tags:    

Similar News