ఫోటో స్టొరీ: లంక లో రకుల్ - మంచు లక్ష్మి

Update: 2018-10-06 11:55 GMT
మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మి మల్టి టాలెంటెడ్ పర్సన్.  టీవీ హోస్ట్.. నటి..నిర్మాత.. ఇలా టెల్గు వారికి మంచు లక్ష్మి పేరు పరిచయం చేయవలసిన అవసరం లేదు.  ఎవరైనా తెలుగు వాడు నాకు మంచు లక్ష్మి తెలీదు అన్నాడంటే వాడొక ఫసాక్... అంతే ఇంకేం లేదు.  సరే టాపిక్ సైడ్ ట్రాక్ లోకి వెళ్ళకుండా మెయిన్ ట్రాక్ లోనే ఉంచుదాం.

మంచు లక్ష్మి పుట్టిన రోజు అక్టోబర్ 8. అంటే జస్ట్ రెండు రోజులు ఉంది అంతే.  ఇక టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు అక్టోబర్ 10.. అంటే ఇంకో నాలుగు రోజులు.  మంచు లక్ష్మి - రకుల్ ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. మీకు గుర్తుందో లేదో గానీ మంచు లక్ష్మి ఫ్యామిలీతో రకుల్ ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది కూడా. ఇద్దరు స్నేహితులు తరచుగా కలుస్తుంటారు. తాజాగా రకుల్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఒక ఫోటోలో ఇద్దరూ ఒకేరకమైన గౌన్ వేసుకున్నారు.. ప్రేమగా హత్తుకున్నారు.

ఇక రకుల్ ఇచ్చిన క్యాప్షన్ "కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ !! లవ్ యు ఇన్ఫినిట్ #ఫ్రెండ్స్ ఫరెవర్  # సోల్ కనెక్ట్  # బర్త్ డే గర్ల్స్ # హాలిడే టైమ్ #లంక డైరీస్   ఈ ఫోటో తీసినందుకు థ్యాంక్ యు @నీరజ కోన".. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా బర్త్ డే వెకేషన్ ని శ్రీలంక లో జరుపుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నరన్న మాట!


Tags:    

Similar News