రకుల్ పట్టు తప్పింది ఎక్కడో తెలుసా?

Update: 2016-06-07 04:38 GMT
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మహా చురుగ్గా ఉంటుంది. అమ్మడికి బాగా స్పీడ్ ఎక్కువ. సినిమాల్లో అంటే కేరక్టర్ కోసం తన స్పీడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటుంది కానీ.. మామూలుగా అయితే ఈ భామను పట్టుకోవడం చాలా కష్టం. ఏ పనిలోనైనా రకుల్ చూపించే వేగం చూసి అందరూ షాక్ తింటూ ఉంటారు. అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య స్పీడ్ ఎక్కువై పడిపోయింది.

రీసెంట్ గా జరిగిన ఓ సైమా ఈవెంట్ కి రకుల్ ప్రీత్ హాజరు కావాల్సి ఉంది కానీ.. ఎక్కడా కనిపించలేదు. అంటే డుమ్మా కొట్టేసిందనే విషయం కాస్త ఆలస్యంగా అర్ధమైంది. ఇందుకు కారణం ఆమె కాలుకు దెబ్బ తగలడమే అనే విషయం తెలుస్తోంది. అందుకే తన జర్నీని రెండు రోజుల పాటు వాయిదా వేసుకుందట. అసలు రకుల్ కి దెబ్బ ఎలా తగిలిగిందంటే.. ప్రస్తుతం యూఎస్ లో జరుగుతున్న ఓ ఎంటర్టెయిన్మెంట్ ఈవెంట్ కి రకుల్ ప్రీత్ హాజరుకావాల్సి ఉంది.

అక్కడి ఓ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తుండగా.. దీనిలో రకుల్ పెర్ఫామెన్స్ ను స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పారు. ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కుతుండగా.. అమ్మడి స్పీడ్ కారణంగా కాలు పట్టు తప్పిందట. నొప్పి భరించలేనంతగా ఉండడంతో.. అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే.. కాలు బెణికిందని, రెండు రోజులు రెస్ట్ అవసరమని చెప్పారట. దీంతో అన్ని కార్యక్రమాలు కట్టిపెట్టి రకుల్ ప్రీత్ సింగ్ కి రెస్ట్ తీసుకోకతప్పలేదు.
Tags:    

Similar News