తలా అజిత్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన సూర్య హీరోయిన్!!

Update: 2020-07-14 05:50 GMT
రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గతేడాది నాగార్జున సరసన మన్మధుడు-2 సినిమాలో మెరిసింది. ఆ సినిమానే తెలుగులో ఆమె లాస్ట్ సినిమా. ఇక్కడ లాభం లేదని బాలీవుడ్, కోలీవుడ్ వైపు మళ్లింది. అయితే త్వరలో అమ్మడు తమిళంలో బిజీ కానుందట. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకుందట. దీంతో రకుల్ పంట పండిందని అంటున్నారు. తెలుగులో అయితే ఎవరు కూడా రకుల్ వైపు కన్నెత్తి చూడట్లేదు. ఇక బాలీవుడ్ లో ఆఫర్లు ఉన్నా కూడా అవి ఇంకా కన్ఫర్మ్ కాలేదట. ఈ భామ ప్రస్తుతం అయితే కేవలం తమిళ ఇండస్ట్రీ పైనే ఆశలు పెట్టుకుంది.

మొన్నామధ్య హీరో సూర్యతో కలిసి 'ఎన్ జి కె' సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టింది. ఇక లాభం లేదని తమ్ముడు కార్తీతో కలిసి దేవ్ అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా బోల్తా కొట్టడంతో కెరీర్ పరంగా ఆలోచనలో పడింది. ఇక ఎట్టకేలకు స్టార్ డైరెక్టర్ శంకర్ తన 'భారతీయుడు-2' సినిమాలో అవకాశం ఇచ్చాడు. కానీ ఆ సినిమాలో రకుల్ సెకండ్ హీరోయిన్. ఇక వెంటనే హీరో శివ కార్తికేయన్ సినిమా 'అయలన్'లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం ప్లాప్ లలో ఉన్నా కూడా రకుల్ కి అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి.

తాజాగా స్టార్ హీరో తలా అజిత్ హీరోగా తెరకెక్కనున్న 'వాలిమై' సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సినీవర్గాల సమాచారం. ఇదే గనక నిజమైతే రకుల్ భారీ ఆఫర్ దక్కించుకున్నట్లే. ప్లాప్ లలో ఉన్న బ్యూటీకి అజిత్ సినిమా ఓ బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాను బోణి కపూర్ నిర్మిస్తాడని తెలుస్తుంది. ఈ భామకి తమిళంలో అవకాశాలు బాగానే వస్తున్నాయి.. కానీ తెలుగులో ఏమైందో తెలియట్లేదట. చూస్తుంటే తమిళ ఇండస్ట్రీలో పాగా వేసేలా ఉంది రకుల్. ఇప్పుడైతే ఈ మూడు సినిమాల పై భారీ ఆశలు పెట్టుకుంది రకుల్. ఇక ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో సినిమాలన్నీ షూటింగులకు సిద్ధం అవుతున్నాయి. చూడాలి మరి రకుల్ అక్కడైనా స్టార్ హీరోయిన్ హోదా పొందుతుందేమో..!
Tags:    

Similar News