రకుల్ ప్రీత్ ఈ కొత్త ట్రయల్ ఏంటో?

Update: 2018-03-21 04:27 GMT
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఇటు తమిళంలోనూ వెలిగిపోయేందుకు ట్రై చేస్తున్న సమయంలో.. తెలుగులోనే వరుస షాకులు తినేసింది. అయినా సరే ఈ అమ్మడు బౌన్స్ బ్యాక్ అయేందుకు ఒక్క సినిమా సరిపోతుందని చెప్పచ్చు. అంతటి క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ.. బిజినెస్ వ్యవహారాల్లో కూడా ఆరితేరిపోతోంది.

ఇప్పుడు తనకంటూ స్పెషల్ గా ఓ సోషల్ మీడియా యాప్ ను రిలీజ్ చేసేసింది రకుల్. రకుల్ ప్రీత్ అఫీషియల్ యాప్ అంటూ ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యూజర్స్ కు అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా.. బోలెడన్ని ప్రత్యేకమైన సంగతులు చెబుతుందట. తనతో పాటు లైవ్ లో టచ్ లో ఉండేందుకు ఈ యాప్ ను ఫాలో అవండి అంటోంది రకుల్. ఈ యాప్ వ్యవహారం ఓకే కానీ.. ప్రస్తుతం ట్విట్టర్ అండ్ ఇన్ స్టాగ్రామ్ ఒక రేంజులో దూసుకుపోతున్నాయి. ఇలాంటి రోజుల్లో అసలు యాప్ ఎందుకు? ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ లలో చెప్పని కొత్త సంగతులు అక్కడ కొత్తగా ఏం చెబుతుంది? లాంటి డౌట్స్ సహజంగానే వస్తాయి.

పైగా దానిని ప్రమోట్ చేయడానికి ఒక హెలికాప్టర్ కంటెస్ట్ అంటోంది రకుల్. ఈమెతో పాటు హెలికాప్టర్ రైడ్ చేయచ్చని.. యూజర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నిజంగానే ఇది టూ మచ్ గా ఉంది. మొన్నామధ్య మ్యాగ్జిమ్ కోసం బికినీ వేస్తే ఎవ్వడూ పట్టించుకోలేదు పాపాయిని.. ఇప్పుడు యాప్ గోలేంటో అనుకుంటున్నారు అభిమానులు. ఇంతా చేస్తే.. ఈ యాప్ కి ఇప్పటివరకూ ఓ వెయ్యి మంది రేటింగులు ఇచ్చారంతే.


Tags:    

Similar News