హైటు మీద అంత మోజేంది రకుల్?

Update: 2016-04-21 04:07 GMT
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. చేపకళ్ల లాంటి చూపులతో.. హాట్ అందాలతో మత్తెక్కించే ఈ ముద్దుగుమ్మ ఆశ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఆగ్రహీరోలతో వరుస సినిమాలు చేస్తున్నా సరైన హిట్ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్న ఈ అమ్మడు ‘సరైనోడు’ మీద చాలానే ఆశలు పెట్టుకొంది.

తాజాగా రిలీజ్ కానున్న సినిమాను కాసేపు పక్కన పెట్టి రకుల్ పర్సనల్ ఇంట్రస్ట్ లకు సంబంధించి ఇప్పటివరకూ ఓపెన్ కాని ఓ విషయం మీద ఆమె బయటపడింది. ‘సరైనోడు’ సినిమా కాకుండా.. మీకు ‘సరైనోడు’ ఎలా ఉండాలన్న ప్రశ్నకు అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. తాను నాలుగు ఇంచ్ ల హీల్ వేసుకున్నా తన కన్నా అతగాడు హైట్ ఉండాలని.. అతడే తనకు సరైనోడంటూ హైటు మీద తనకున్న మోజును చెప్పేసింది. కాబోయే వాడెలా ఉండాలన్న విషయాన్ని రకుల్ చెప్పిన తీరు చూసినప్పుడు.. అమ్మడు ఓకే అనాలంటే కుర్రాడు ఎంత హైటు ఉండాలన్నది లెక్కేస్తే చాలామంది ఫీల్ కావాల్సిందే.

ఎందుకంటే రకుల్ హైట్ 5 “8”. అమ్మడు నాలుగు ఇంచుల హీల్ వేసుకున్నా హైట్ కావాలంటే.. మినిమం అబ్బాయి 6 “3” అయితే పక్కా అవసరం. అంటే.. రకుల్ మనసు దోచుకోవాలంటే మినిమం 6 “3”  ఉంటే కానీ సరైనోడు కాదన్న మాట. ఆరు అడుగులుంటేనే అదిరిపోయే హైట్ అని మురిసిపోయే కుర్రాళ్లు.. రకుల్ మాట వింటే షాక్ తినాల్సిందే. 58 కేజీల ఈ పాతికేళ్ల పరువానికి హైటు మీద చాలానే ఆశలున్నట్లున్నాయే..?
Tags:    

Similar News