మ‌హేష్... ర‌కుల్ సేమ్ టు సేమా!

Update: 2016-05-31 05:16 GMT
ఈమ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ మాట్లాడుతూ క‌థ‌ల విష‌యంలో నాన్చుడు ధోర‌ణి అస్స‌లు న‌చ్చ‌ద‌ని చెప్పాడు. క‌థ విన‌గానే ఆ క్ష‌ణంలోనే ఫ‌టాఫ‌ట్  తేల్చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ర‌కుల్ కూడా సేమ్ టు సేమ్ అదే డైలాగే చెబుతోంది. అస‌లే కాంపిటీష‌న్ కాలం కాబ‌ట్టి, క‌థ‌ల విష‌యంలో ఆచితూచి అడుగేయాల్సిందే క‌దా అని అడిగితే... అలాంటి రూల్స్ మ‌న‌కు లేవులేబ్బా అంటూ  ఈజీగా  త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చింది ర‌కుల్‌.  ఎక్స్‌ పీరియ‌న్స్ వ‌చ్చింద‌న‌నైనా అనుకోవ‌చ్చు... లేదంటే మ‌రొక‌టేదైనా అనుకోవచ్చు కానీ ఓ క‌థ విన్న వెంట‌నే చేయాలా వ‌ద్దా అనే విష‌యంపై క్ష‌ణాల్లో నిర్ణ‌యానికొచ్చేస్తున్నా అంటోంది ర‌కుల్.

సినిమా ఫ్లాప‌వుతుందేమో, అవ‌కాశాలు రావేమో అని కంగారేమీ ఉండ‌దా మ‌రీ?  అంటే ``ఏ సినిమా ఎలాంటి రిజ‌ల్ట్‌ ని తీసుకొస్తుందో ఎవ‌రికి తెలుసు? అయినా సినిమా ఫ్లాప‌యితే నాదొక్క‌దానిదే బాధ్య‌త కాదు క‌దా! పైగా నా సినిమా ఎలాంటి రిజ‌ల్ట్ సాధించినా నా అవ‌కాశాల‌పై మాత్రం ఆ ప్ర‌భావం ఉండ‌దు. ఇప్ప‌టిదాకా నాకూ కొన్నిఫెయిల్యూర్స్ ఎదుర‌య్యాయి. అయినా నా న‌ట‌న‌ని చూసి, నా టాలెంట్‌ ని గ‌మ‌నించే  అవ‌కాశాలివ్వాలి కానీ హిట్లున్నాయా? ఫ‌్లాపులున్నాయా అని చూడ‌కూడ‌దు క‌దా `` అని సెలవిచ్చింది. మొత్తంగా ర‌కుల్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. వ‌ర‌స‌బెట్టి అవ‌కాశాలొస్తున్నాయి కాబ‌ట్టి ఆమె హిట్లు, ఫెయిల్యూర్ల‌ని అస‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. అది కూడా ఒక ర‌కంగా మంచి ప‌ద్ధ‌తే మ‌రి!
Tags:    

Similar News