యంగ్ టైగర్ ఎన్టీఆర్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రంతో.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొత్త పాత్ర కూడా పోషిస్తోంది. తొలిసారిగా తన రోల్ కు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. అలా డబ్బింగ్ చెబుతూ తీయించుకున్న ఓ ఫోటోను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసింది రకుల్.
'డబ్బింగ్ ఈజీయేనని ఎవరు చెప్పారు చెప్పారసలు ? అయినా నేను దీన్ని ఇష్టపడుతున్నా' అంటూ తను షేర్ చేసిన ఫోటోతో పాటు పోస్ట్ కూడా పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఢిల్లీ బేస్డ్ భామ ఇలా డబ్బింగ్ చెప్పే స్థాయికి తెలుగు నేర్చుకోవడానికి చాలానే కష్టపడింది. నాన్నకు ప్రేమతో షూటింగ్ ప్రారంభమయినప్పటి నుంచి.. మొత్తం యూనిట్ కి తనతో తెలుగులోనే మాట్లాడాలని ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. అందుకే ఇప్పుడు తెలుగులో ధారాళంగా మాట్లాడే స్థాయికి రకుల్ వచ్చింది. మాటలొచ్చినంత మాత్రాన.. సినిమాకి డబ్బింగ్ చెప్పేయడం కుదరదు. ఆ టైమింగ్, ఫ్లూయన్సీ కూడా రావాల్సిందే.
ఇండస్ట్రీలోకి వచ్చిన నాలుగేళ్లలోనే డబ్బింగ్ చెప్పే స్థాయికి చేరడమంటే చిన్న విషయం కాదు. సమంత లాంటి స్టార్ హీరోయిన్లు చాలాకాలం నుంచే కెరీర్ కొనసాగిస్తున్నారు. టాప్ హీరోయిన్లుగా వెలుగుతున్నారు. అయినా సరే ఇప్పటివరకూ తెలుగులో పూర్తిగా మాట్లాడేందుకు ప్రయత్నించలేదు. కానీ కొత్తగా వచ్చిన ఓ నార్త్ ఇండియన్ తెలుగు నేర్చుకుని, తన సత్తా చాటుతోంది. మరి టాలీవుడ్ లో వెలుగుతున్న సౌత్ సుందరీమణులు ఇప్పుడు.. రకుల్ ని రోల్ మోడల్ గా తీసుకుని.. సొంత డబ్బింగ్ కోసం ప్రయత్నిస్తారేమో చూడాలి.