ఫొటోటాక్‌ : బీచ్ లో ముద్దుగుమ్మ పరువాల ఆరబోత

Update: 2022-10-31 14:30 GMT
ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే ఎక్కువగా ఇలాంటి ఫోటో షూట్స్ తో వార్తల్లో నిలుస్తోంది. అందాల రకుల్‌ ప్రీత్‌ సింగ్ ప్రస్తుతం హాలీడేస్ ను ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా ఉంది. బీచ్ లో సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ తన అందాలను అభిమానులకు చూపిస్తూ తెగ ఫోటోలను షేర్‌ చేస్తోంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు ఈమె నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వగా మరో వైపు ఈమె కొత్త ఆఫర్స్‌ ను దక్కించుకుంటూనే ఉందని తెలుస్తోంది. అయితే పాపం బాలీవుడ్‌ పరిస్థితి సరిగా లేని కారణంగా అక్కడ ఇప్పటి వరకు రకుల్‌ కమర్షియల్‌ సక్సెస్ దక్కించుకోలేదు.

టాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో ఈ అమ్మడు ఒకానొక సమయంలో ఫుల్‌ బిజీ హీరోయిన్ గా కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం అమ్మడికి కనీసం ఆఫర్లు రావడం లేదు. సౌత్‌ లో మళ్లీ బిజీ అయ్యేందుకు ఇలాంటి ఫోటో షూట్స్ ను ఎరగా వేస్తుంది అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

తాజాగా బీచ్ లో అందాల ఆరబోత తో పిచ్చెక్కిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజా ఫోటో షూట్‌ తో ప్రతి ఒక్కరిని కూడా మెప్పించింది. క్లోజప్ లో క్లీవేజ్ షో ను చూపించడంతో పాటు నడుము అందాన్ని చూపించి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఊరిస్తోంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లయినా కూడా రకుల్‌ అందం ఏమాత్రం తగ్గలేదు.. ఒకింత పెరిగినట్లుగానే ఉందని జనాలు అనుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News