మా హవానే నడుస్తోందంటున్న బ్యూటీ

Update: 2019-04-03 11:54 GMT
గత కొంత కాలంగా టాలీవుడ్ లో అవకాశాలు తగ్గుముఖం పట్టాక రకుల్ ప్రీత్ సింగ్ కన్ను బాలీవుడ్ మీద పడింది. అయితే అదేదో యూత్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయని కాదు. ఎంత ఏజ్ బార్ ఉన్నా స్టార్లు అయితే చాలు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే అజయ్ దేవగన్ తో దే దే ప్యార్ దే పూర్తి చేసిన రకుల్ మరో అర్ధ సెంచరీ సెంచరీ వయసు హీరో నాగార్జునతో మన్మధుడు 2లో జోడి కట్టింది.

ఇదిలా ఉండగా పురుషాధిపత్యం గురించి అందులోనూ తెలుగు సినిమాల్లో ఇది ఎక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ అడిగిన ఓ ప్రశ్నకు రకుల్ కాస్త తెలివిగానే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ట్రెండ్ మారిందని నయనతార-కంగనా రౌనత్-దీపికా పదుకునే-అలియా భట్-త్రిషలు దీన్ని సవాల్ చేసి కొత్త అర్థం చెబుతున్నారని హీరో లేకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలను తమ టాలెంట్ తో నిలబెట్టి విమెన్ పవర్ చూపుతున్నారని సెలవిచ్చింది

అంతా బాగానే ఉంది కాని రకుల్ ప్రీత్ సింగ్ తను స్వయంగా అలాంటి పాత్రలు ఇప్పటిదాకా ఒక్కటీ చేయకపోవడమే విచిత్రం. ఛాలెంజింగ్ గా ఇది రకుల్ మాత్రమే చేయగలదు అనే రోల్ రకుల్ కు ఇప్పటిదాకా రాలేదని చెప్పాలి. పైన తను చెప్పిన ఉదాహరణలన్ని పర్ఫెక్ట్ కాని అందరికి అలాంటి అవకాశాలు దక్కడం లేదన్న వాస్తవాన్ని కూడా ఇక్కడ మర్చిపోకూడదు. రకుల్ కు గత కొంత కాలంగా టైం ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఇటీవలే కార్తితో చేసిన దేవ్ డిజాస్టర్ కోలీవుడ్ ఛాన్సులకు పెద్ద గండి కొట్టింది. అందుకే ఆశలన్నీ అజయ్ దేవగన్ నాగ్ ల మీదే పెట్టుకుంది.
Tags:    

Similar News