ఫోటో స్టోరీ:లిమిట్స్‌ కు దూరంగా రకుల్‌

Update: 2018-11-03 05:11 GMT
టాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈమద్య కాలంలో తమిళం మరియు హిందీపై ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది. తెలుగులో చిన్న చిన్న పాత్రలతో సరి పెట్టేస్తోంది. తాజాగా ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో శ్రీదేవిగా నటించి మళ్లీ ముంబయి చెక్కేసిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం అక్కడ అజయ్‌ దేవగన్‌ తో కలిసి ‘దే దే ప్యార్‌ దే’ అనే చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్‌ కోసం మరింత ఆకర్షణీయంగా తయారు అయిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈమద్య వరుసగా కవర్‌ పేజీలను ఎక్కేస్తోంది.

ప్రముఖ మ్యాగజైన్స్‌ కవర్‌ పేజీల కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను ఎంపిక చేసుకుంటున్నారు. హాట్‌ హాట్‌ ఫోజ్‌ లతో ఇప్పటికే పు కవర్‌ పేజీలపై కనిపించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈసారి ఎఫ్‌ ఎమ్‌ హెచ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై కనిపించింది. ఇద్దరు మోడల్స్‌ తో ఈ అమ్మడు కవర్‌ పేజీపై చాలా సెక్సీగా కనిపించింది. ఈమె కాస్ట్యూమ్స్‌ - మేకప్‌ అంతా కూడా చాలా హాట్‌ గా ఉన్నాయి. ఇక ఈ కవర్‌ పేజీపై నో బోర్డర్‌ ఆఫ్‌ లిమిట్స్‌ అంటూ మ్యాగజైన్‌ కవర్‌ పై క్యాప్షన్‌ పెట్టడం జరిగింది.

నటన మరియు అందాల ప్రదర్శణలో ఏమాత్రం లిమిట్స్‌ పెట్టుకోకుండా, అవసరం మేరకు ప్రేక్షకులకు కనువిందు చేస్తా అన్నట్లుగా నో లిమిట్స్‌ అంటోంది రకుల్‌. తెలుగులో కాస్త చల్లబడ్డ రకుల్‌ మళ్లీ టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు ఫుల్‌ స్వింగ్‌ లో వస్తుందని ఆశిద్దాం.
Tags:    

Similar News