ఎంజాయ్ మెంట్ ఎక్కువయ్యి ఆ నొప్పొచ్చింది

Update: 2016-06-18 13:30 GMT
ఈ మధ్య రకుల్ తన లైఫ్ లో ఎంజాయ్మెంట్ ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ కి వచ్చిందట. అందుకే ఎంచక్కా లాస్ వెగాస్ ట్రిప్ వేసి ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసేసింది. మరి రకుల్ పాప మామూలుగానే అన్ని విషయాల్లోనూ బాగా ఓపెన్. అలాంటి ఈ చిన్నది లాస్ వెగాస్ లాంటి స్వర్గం తాలూకా అనుభవాలను అభిమానులకు పంచకుండా ఉంటుందా?

ఎంజాయ్మెంట్ గురించి చెప్పే సెలబ్రిటీలు చాలామందే ఉంటారు. కానీ.. ఆ తర్వావ వచ్చే పెయిన్ గురించి డీటైల్స్ చెప్పేవారి లెక్క తక్కువగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్... రాత్రి మందేశాక తెల్లారి హేంగోవర్ బాపతు అనుకోవచ్చు. సాధారణంగా మందుబాబులకు తాగింది ఎక్కువైతే తల పట్టేస్తుంది. కానీ ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ గ్యాంబ్లింగ్ లో దెబ్బ వేయించుకుంది.  ఈ షాక్ నుంచి కోలుకుని ఎయిర్ పోర్ట్ కి వచ్చే సరికి అమ్మడికి మెడ పట్టేసిందట.     

'ఎయిర్ పోర్టుకి చేరుకున్నాక సడెన్ గా మెడ కుడివైపు పట్టేసింది. భయంకరంగా నొప్పి వచ్చేసింది. చిన్న నొప్పే అనుకున్నా కానీ ఫ్లైట్ ఎక్కాక మెడ ఎడమవైపు తిరిగిపోవడం మొదలయ్యింది.  ఆ టైంలో నేనొక్కదాన్నే ఉండడంతో బాగా భయం వేసేసింది. నా మేనేజర్ కు ఫోన్ చేసి సీటెల్ లో హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని.. అక్కడ ఫ్లైట్ ఆగగానే ముందు అంబులెన్స్ ఎక్కేశా' అంటూ ఎంజాయ్మెంట్ తర్వాత నొప్పి గురించి డీటైల్డ్ గా వివరించింది రకుల్ ప్రీత్ సింగ్.

Tags:    

Similar News