హీరోయిన్లని పెళ్లెప్పుడు చేసుకొంటారని మీడియా అడగడం కామనే. సీనియర్ హీరోయిన్లకైతే ఆ ప్రశ్న తరచుగా ఎదురవుతుంటుంది. చాలామంది మాకింకా ఆ ఆలోచనే రాలేదని సెలవిస్తుంటారు. నిజంగా ఒకట్రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని వున్నా ఆ విషయాన్ని మాత్రం బయట పెట్టరు. అవకాశాలు ఎక్కడ తగ్గుతాయో అన్నది వాళ్ల బెంగ. ఉన్నట్టుండి అవకాశాలు ఎక్కువగా రావడం మొదలైతే చేసుకోవాలనుకున్న పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటారన్నమాట. ఈమధ్య స్టార్ గా వెలుగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగారు. అయితే ఆమె మాత్రం చిత్రమైన సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మామూలుగా అయితే నాలుగైదేళ్ల తర్వాతనో లేదంటే నచ్చినవాడు దొరికినప్పుడనో సమాధానం చెబుతుంటారు కథానాయికలు. కానీ రకుల్ మాత్రం మహేష్ తో కలసి సినిమా చేసేవరకు పెళ్లి చేసుకొనే అవకాశమే లేదని సెలవిచ్చింది. అదేంటి అని అడిగితే తెలుగులో స్టార్లందరితోనూ కలిసి నటిస్తున్నాను కదా, మహేష్ తో కూడా కలిసి నటిస్తే ఓ పనైపోతుందని చెప్పుకొచ్చింది. ఉన్నట్టుండి నేను పెళ్లి నిర్ణయం తీసుకుంటే మహేష్ తో సినిమా చేయలేను కదా అని సెలవిచ్చింది. హీరోయిన్లకి మహేష్ తో కలిసి నటించడమంటే ఎంత క్రేజో దీన్నిబట్టి అర్థమవుతోంది. మహేష్ తో నటించే ఛాన్స్ దక్కాక రకుల్ పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెడుతుందేమో మరి!