రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. ఈ భామ ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ, తమిళ సినిమాల్లోను నటిస్తోంది. తెలుగు తెరకు ‘కెరటం’ అనే సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో మొదటి హిట్ అందుకుని తెలుగు వారికి దగ్గరైంది. ఈ తర్వాత నుండి తన అంద చందాలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొడుతోంది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్గన్తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో అవకాశాలు జోరుగా వస్తాయనుకుంటే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
రకుల్ కొత్త కొత్త అందాలతో వీలున్నప్పడల్లా ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. రకుల్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. టాలీవుడ్ లో ఉన్నంత కాలం అందాలు ఆరబోసింది కానీ హద్దులు అయితే పెట్టుకుంది. కానీ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఆ బౌండరీ లైన్ కనబడటం లేదు. వీలైనప్పుడల్లా రెచ్చిపోతుంది. అడిగిందే ఆలస్యమన్నట్లు అందాలన్నీ మూటగట్టి కెమెరా ముందు పెట్టేస్తుంది. తాజాగా లాక్ డౌన్ లో ఉన్న రకుల్.. బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కేవలం సన్నని తెరను అడ్డుపెట్టుకొని అందాలను ఎర వేసింది. తెల్లని రకుల్ ఒంపుసొంపులు.. నల్లని డ్రెస్ లో జాలువారాయి. ఉన్నట్లుండి అమ్మడి మనసు ఎటు కదులుతుందో మరి ఆ ఫొటోతో అంతగా సెగలు పుట్టిస్తుంది రకుల్. బాలీవుడ్ నీళ్ల మహిమో ఏమో కానీ అక్కడికి వెళ్లిన తర్వాత హద్దులన్నీ తీసి పక్కనబెట్టేసింది. తాజాగా ఈ బ్లాక్ డ్రస్ లో అమ్మడు అందాలను చూస్తుంటే మతులు చెడిపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.