సైక్లింగ్ చేస్తూ షూటింగ్ కి వెళ్లిన రకుల్..!

Update: 2021-01-14 01:30 GMT
స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వంతంగా జిమ్ లు ఏర్పాటు చేయడంతో పాటు జిమ్‌ లో రెగ్యులర్ గా ఎక్సర్‌ సైజ్‌ చేస్తూ వస్తోంది. ఆ ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా మధ్యమాలలో షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్ లో స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. తాజాగా సైక్లింగ్‌ చేస్తున్న ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రకుల్.

రకుల్ ప్రీత్ సింగ్ 12 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ షూటింగ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం వెల్లడించిన రకుల్.. వర్కౌట్ టైం సేవ్ చేసుకుంటూ తాను నటిస్తున్న 'మేడే' సెట్స్ కి వెళ్ళినట్లు తెలిపింది. ఇంతకముందు రకుల్ వర్షంలో మంచు లక్ష్మీ తో కలిసి సైక్లింగ్‌ చేసిన వీడియోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇద్దరు 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. త్వరలో 100 కిలోమీటర్ల సైక్లింగ్‌ కూడా చేస్తానని పేర్కొంది.

కాగా, రకుల్ ప్రస్తుతం నితిన్ తో కలిసి 'చెక్' సినిమాలో న‌టిస్తోంది. దీంతో పాటు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో నటించింది. ఇక బాలీవుడ్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. జాన్ అబ్రహాంతో కలిసి 'ఎటాక్' సినిమాలో నటించింది. అలానే అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ - అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మే డే' సినిమా చేస్తోంది.


Full View
Tags:    

Similar News