యోగాలో వెన్ను విరిచే ర‌కుల్ టిప్ అదిరెనుగా

Update: 2020-09-06 07:30 GMT
అసలు మనసు అంటే ఏమిటి?.. యోగ వ్యవస్థలో మనస్సును 16 భాగాలుగా ఎలా చూసేవారో సద్గురు ఏనాడో వివ‌రించారు. యోగాలో నాలుగు ప్రధాన భాగాలను బుద్ధి- అహంకారం- మనస్సు- చిత్తం అనేవాటిని శుద్ధి చేయ‌డం అంటారు ఆయ‌న‌. ఆధునిక సమాజంలో బుద్ధికి మరీ ఎక్కువ ప్రాముఖ్యతను యోగాలో కల్పించామ‌ని సద్గురు వివ‌రిస్తుంటారు. దానివల్ల జీవితాన్ని చూసే విధానం వేరేగా ఉంటుంది. లోలోని జ్ఞానాన్ని స్పృశించడం ద్వారా సృష్టి మూలాన్ని అందుకోవచ్చు అని యోగా గురువులు సెల‌విస్తుంటారు.

అదంతా ఏమో కానీ.. ఇక్క‌డ ర‌కుల్ స‌రికొత్త యోగాన్ని బోధిస్తూ మ‌నుషుల బుద్ధి కుశ‌ల‌త‌కు ప‌రీక్ష పెడుతుండ‌డం అన్య‌దా స‌ర్వ‌దా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ``బాడీ స్టిఫ్ గా లేక‌పోతే మైండ్ ప్రేమ‌లో వీక‌వుతుంది!`` అనే అర్థం వ‌చ్చేలా ర‌కుల్ ఓ ఫోటోని దాంతో పాటే ఈమోజీల్ని షేర్ చేసింది. అన్షుక‌యోగా సెంట‌ర్ లో అరుదైన ఫీట్ ని ప్రెజెంట్ చేసిందిలా.

గాల్లో తాళ్లు క‌ట్టి దానికి వేలాడ‌డం .. ఉయ్యాలా జంపాలా ఆడే యోగాను ఫాలో అవ్వ‌డం .. ఇద్ద‌రు ఉంటే ఒక‌రితో ఒక‌రు అనుసంధాన‌మై మ‌మైకంతో యోగాభ్యాసం చేయ‌డం ఎలానో ఇదిగో ఇక్క‌డ ర‌కుల్ ఫీట్ చూస్తుంటే స్ట‌డీ చేయ‌డం వీజీనే! చూస్తుంటే న‌డుము విరిగిపోతోందా? అన్న‌ట్టుగా భ‌య‌పెడుతున్నా.. ఈ ఫీట్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అప‌రిమితం సుమీ! ర‌కుల్ ని చూసి నేర్వాల్సింది ఎంతైనా ఉంద‌ని క‌రోనా మాన‌సిక ఒత్తిడి ‌కాలంలో అంద‌రూ గుర్తెర‌గాలి!!
Tags:    

Similar News