ప‌వ‌న్ కాదా హ్యాండిచ్చింది! నాగార్జున‌?

Update: 2015-10-15 06:58 GMT
రామ్‌ చ‌ర‌ణ్ న‌టించిన బ్రూస్‌ లీ ఈనెల 16న ముందే ప్ర‌క‌టించిన తేదీకే రిలీజైపోతోంది. ఈ చిత్రంలో క్ల‌యిమాక్స్ లో మెగాస్టార్ చిరు ఎంట్రీ మెగాభిమానులంద‌రికీ ఓ స‌ర్‌ ప్రైజ్ ఎలిమెంట్‌లా ఉంటుంద‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌చారం చేసింది. మెగాస్టార్ అందాల హీరోయిన్ ర‌కూల్ ప్రీత్‌ ని ర‌క్షిస్తారుట‌. ఆ త‌ర్వాత చెర్రీతో ర‌కూల్ ని క‌లిపేసి ప్రేమికుల‌కు సాయ‌ప‌డ‌తారు. ఆ బిట్‌ లో చిరు లుక్ ఓ గ్యాంగ్ లీడ‌ర్‌ ని త‌ల‌పిస్తుంద‌ని నిన్న‌టి రోజున చ‌ర‌ణ్ సైతం చెప్పాడు.

అయితే ఈ క్యారెక్ట‌ర్‌ లో అస‌లు మొద‌ట అనుకున్న‌ది మెగాస్టార్‌ ని కానే కాద‌ని ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి. తొలుత ఈ క్యారెక్ట‌ర్ చేయాల్సిందిగా ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ ని సంప్ర‌దించార‌ని, అయితే ప‌వ‌న్ సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ని పుకార్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత కింగ్ నాగార్జున‌ ని సంప్ర‌దించారు. మొద‌ట కింగ్ ఒప్పుకున్నా చివ‌రి క్ష‌ణంలో కుదరలేదట ... అంటూ మ‌రో వార్త హ‌ల్‌చ‌ల్ చేసింది.  అలాగే ఆ రోల్‌ లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తే ఇటు తెలుగు, అటు త‌మిళ మార్కెట్‌ కి సాయం అవుతుంద‌ని భావించారుట‌. అయితే అది కూడా సాధ్య‌ప‌డ‌లేదు. దాంతో చివ‌రికి మెగాస్టార్ చిరంజీవి రంగంలో కి దిగాల్సి వ‌చ్చిందిట‌.

నాన్న‌గారు న‌టించే సంద‌ర్భం వ‌స్తే వ‌దులుకుంటానా? అందుకే వెంట‌నే అడిగేశాను. ఆయ‌న ఓకే చెప్పేశారు.. అంటూ చ‌ర‌ణ్ నిన్న‌టిరోజున చెప్పాడు. మొత్తానికి ఆ పెద్ద హీరో ప‌వ‌న్ కాదు నాగార్జున అని తెలిసిపోయిన‌ట్టే.  నాగ్‌, చిరు స్నేహితులే కాబ‌ట్టి ఇద్ద‌రూ ఉన్న స‌న్నివేశాన్ని భేరీజు వేసుకుని అలా ఫిక్స‌య్యార‌ని అనుకోవ‌చ్చు.
Tags:    

Similar News