చెర్రీ.. బాల‌య్య‌... ఇద్ద‌రూ షాకిచ్చారుగా?

Update: 2017-06-10 07:38 GMT
ఒకొక్క సినిమాకి నాలుగైదు పేర్లు ప్ర‌చారంలోకి రావ‌డం ఇటీవ‌ల ప‌రిపాటిగా మారింది.  ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించాల‌నో, లేదంటే నిజంగానే పేరుపై ఓ నిర్ణ‌యానికి రావ‌డానికి ఆల‌స్య‌మ‌వుతుందో తెలియ‌దు కానీ... సినిమా స‌గం పూర్త‌య్యాక‌గానీ టైటిల్ ఫిక్స్ కావ‌డం లేదు. ఈలోపు సినిమా పేరు గురించి  ఎంత చ‌ర్చ జ‌ర‌గాలో అంత జ‌రిగిపోతుంటుంది. అది కూడా  సినిమా ప్ర‌చారానికి ఉప‌యోగ‌ప‌డుతోంది.

మామూలుగా  పూరి జ‌గ‌న్నాథ్ త‌న సినిమాకి కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్పుడే పేరును ప్ర‌క‌టిస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం ఆయ‌న కూడా టైటిల్‌ ని కొన్నాళ్ల‌పాటు దాచిపెట్టారు.   దాంతో బాల‌కృష్ణ‌ - పూరి జ‌గ‌న్నాథ్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న సినిమాకి  సంబంధించి బోలెడ‌న్ని పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఉస్తాద్ అని - జై బాల‌య్య అనీ... ఇలా నాలుగైదు పేర్లు చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చాయి. సుకుమార్‌ - రామ్‌ చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న సినిమా విష‌యంలోనూ అంతే. రేప‌ల్లె అని - ప‌ల్లెటూరి మొన‌గాడు అని ఇలా చాలా పేర్లే వెలుగులోకి వ‌చ్చాయి. దాంతో ప్ర‌చారంలో ఉన్న ఆ పేర్ల‌లో ఏదో ఒక‌టి ఫిక్స్ అవుతుంద‌ని ఊహించారంతా. ఇదివ‌ర‌కటి సినిమాల విష‌యంలో అదే జ‌రిగేది. ప్ర‌చారంలో ఉన్న పేర్ల‌లో ఒక‌టి ఫిక్స్ అయిపోయేది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జ‌రిగింది. రామ్‌ చ‌రణ్ క‌థానాయ‌కుడిగా తాను తెర‌కెక్కిస్తున్న  సినిమాకి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రంగ‌స్థ‌లం అనే పేరును ఫిక్స్ చేశాడు సుకుమార్‌. అలాగే బాల‌కృష్ణ సినిమాకి కూడా ప్ర‌చారంలో లేని `పైసా వ‌సూల్‌` అనే పేరును ఫిక్స్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఈ రెండు పేర్లు కూడా అంచ‌నాల‌కి అంద‌ని రీతిలో ఉండ‌టంతో ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర‌మైన చర్చ జ‌రుగుతోంది. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కూడా  మాస్ అప్పీల్  గురించి ఆలోచించ‌కుండా, క‌థ‌ని బ‌ట్టే పేరుని ఫిక్స్ చేశార‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News