ఈ మధ్య టాలీవుడ్ లో వరుసగా ఎక్స్ ప్రెస్ లు దూసుకొస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ను తీసుకొచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీ.. మొన్న సంక్రాంతి పండుగకు ఎక్స్ ప్రెస్ రాజాను రిలీజ్ చేశాడు. రెండుసార్లు ఎక్స్ ప్రెస్ టైటిల్ తో సక్సెస్ కొట్టిన ఈ దర్శకుడు.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునే పనిలో ఉన్నాడు.
ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ధృవ.. ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేసిన వెంటనే.. మేర్లపాక గాంధీతో చెర్రీ సినిమా చేస్తాడనే టాక్ ఉంది. ఈ మూవీకి 'మెగా ఎక్స్ ప్రెస్' అనే టైటిల్ ని ప్రపోజ్ చేశాడట గాంధీ. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందే ఈ స్క్రిప్ట్.. పక్కా లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే.. ఎక్స్ ప్రెస్ సెంటిమెంట్ ని వదిలిపెట్టలేకపోవడాన్ని.. చెర్రీ ఏ మాత్రం సపోర్ట్ చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది.
బ్రూస్ లీ మూవీలో రామ్ చరణ్ 'మెగా మీటర్' అంటూ ఓ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే.. మెగా ఎక్స్ ప్రెస్ టైటిల్ కి కూడా చెర్రీ ఒప్పేసుకుంటాడని దర్శకుడి యోచనగా తెలుస్తోంది. కానీ.. మెగాస్టార్ వారసుడిగా మెగా భజన చేయాల్సిన అవసరం చరణ్ కి లేదన్న మాట సుస్పష్టం. టైటిల్ లోనే మెగాను చేర్చేసి.. మరీ అంత మెగా డప్పు కొట్టేందుకు రామ్ చరణ్ ఒప్పుకుంటేనే ఆశ్చర్యపోవాలి.