ఒకే అమ్మాయికి ట్రై చేస్తున్న చైతూ, చెర్రీ

Update: 2015-09-30 17:30 GMT
ప్రేమమ్ తెలుగు రీమేక్ లో.. నాగ చైతన్య ముగ్గురమ్మాయిలతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇందులో మెచ్యూర్డ్ హీరోయిన్ కేరక్టర్ ఒకటి ఉంది. ఈ పాత్ర కోసం ధనుష్ అనేకుడులో నటించిన అమిరా దస్తూర్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకా టాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అమిరా నుంచి ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.

ఇంతలోనే మరో అవకాశం అమిరా దస్తూర్ తలుపు తట్టింది. రామ్ చరణ్ హీరోగా తని ఒరువన్ ని రీమేక్ చేయబోతున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ మూవీలో ప్రధాన పాత్ర కోసం కోసం అమీరాని తీసుకోవాలని అనుకుంటున్నాడట సూరి. ఈ భామ హైద్రాబాద్ వచ్చినపుడు.. ఓసారి కలిసి ఆఫర్ గురించి వివరించాడట. ఈ సుందరి డెసిషన్ ని మాత్రం పెండింగ్ లోనే పెట్టింది యధావిధిగా.

రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి, రెండూ బడా స్టార్ల వారసులవే, అంతే కాదు ఆ రెండు మూవీస్ రీమేక్సే, ఈ రెండింటి కోసం డైరెక్టర్లు అమిరా దస్తూర్ నే అప్రోచ్  కావడం విశేషం. ఏ మూవీతో తెలుగులో అరంగేట్రం చేస్తుందో ఇంకా తెలీకపోయినా.. రీమేక్ సుందరిగా మారిపోతుందేమో అనిపిస్తోంది.. ఈ ఆఫర్స్ చూస్తుంటే.
Tags:    

Similar News