దగ్గుబాటి వివాహ వేడుకల్లో చరణ్-ఉపాసన

Update: 2019-03-24 08:22 GMT
విక్టరీ వెంకటేష్ డాటర్ ఆశ్రిత వివాహం వినాయక్ తో జైపూర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ వివాహం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమంగా సాగడంతో ఫోటోలు చూడలేకపోయామని అభిమానులు కాస్త నిరాశ చెందారు.  ఇప్పుడు చరణ్ సతీమణి ఉపాసన ఆ లోటు తీర్చేసింది.  తన ట్విట్టర్ ఖాతా ద్వారా నాలుగు ఫోటోలు పోస్ట్ చేసి అభిమానులను సంతోషపెట్టింది.

'కంగ్రాచ్యులేషన్స్ వెంకీ అంకుల్.. నీరు ఆంటీ.. ఆశ్రిత & వినాయక్.  అందరికీ అల్ ది బెస్ట్.  రానా దగ్గుబాటి.. Mr. C మీరిద్దరూ సూపర్' అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. ఒక ఫోటోలో వధూవరులతో పాటుగా వెంకటేష్.. ఆయన సతీమణి నీరజ ఉన్నారు. వారితో చరణ్ - ఉపాసన జంట పోజిచ్చారు.  మరో ఫోటోలో రానా.. చరణ్ లతో పాటు ఉపాసన ఉంది.  మరో ఫోటోలతో మాత్రం Mr & Mrs C మాత్రమే ఉన్నారు.  అసలే సెలబ్రిటీ వివాహం కాబట్టి అందరూ డిజైనర్ డ్రెస్సులలో తళుక్కున మెరిశారు.  ముఖ్యంగా రానా మాత్రం పెదరాయుడు గెటప్ లో గుబురు గెడ్డంతో డిఫరెంట్ గా ఉన్నాడు.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలు లైకులు మీద లైకులు పడిపోతున్నాయి. చరణ్.. రానాలు క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే..  ఈ ఫోటోలలో మిస్ అయిన వారు రానా కజిన్  చైతు.. చైతు సతీమణి సమంతా. ఇక చినబాబు అఖిల్ కూడా.  త్వరలో ఆ ఫోటోలు కూడా వచ్చేస్తాయి లెండి. 
Tags:    

Similar News