ఉపాసన తొలిప్రేమ.. చరణ్ ఇంటిలిజెంట్

Update: 2018-02-02 16:35 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి చూపు మెగా హీరోల వైవు మళ్లింది. సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ సినిమాలు ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ అవుతుండడంతో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటుందా అని అందరు చర్చించుకుంటున్నారు. ఇంటిలిజెంట్ ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుండగా తొలిప్రేమ నెక్స్ట్ డే అంటే 10న రిలీజ్ కాబోతోంది. అయితే మెగా ఫ్యామిలి వారు కూడా ప్రస్తుతం ఏ సినిమాపై స్పందించాలో అనే విషయంపై కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారని టాక్ వచ్చింది.

కానీ మెగా పవర్ స్టార్ దంపతులు మాత్రం రూమర్స్ కి చెక్ పెట్టి ఎట్టకేలకు ఆ సినిమాలపై స్పందించారు. అయితే ఇద్దరు ఒక్కో సినిమాపై స్పందించడం కొంచెం డిఫెరెంట్ గా అనిపిస్తోంది. వరుణ్ తేజ్ తొలి ప్రేమకు ఉపాసన సపోర్ట్ చేస్తే చెర్రీ సాయి ఇంటిలిజెంట్ పై కామెంట్ చేశాడు. వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన తొలిప్రేమ ట్రైలర్ పై ఉపాసన స్పందిస్తూ.. వరుణ్ తేజ్ ఈజ్ సో స్వీట్.. చూస్తుంటే సినిమాను ప్రతి గర్ల్ డిఫెరెంట్ గా ఎంజాయ్ చేస్తుందేమో అని అనిపిస్తోంది. గుడ్ లాక్ అని ట్వీట్ చేయగా చరణ్ ఫెస్ బుక్ ద్వారా సాయిట్రైలర్ పై స్పందించాడు.

"ప్రతి ఫ్రెమ్ లో వివి.వినాయక్ గారి మ్యాజిక్ చూడవచ్చు..తప్పకుండా సాయి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్" అని రామ్ చరణ్ తేజ్ కామెంట్ చేశాడు. ఇలా ఈ మెగా దంపతులు ఇద్దరు చెరో సినిమాపై స్పందించి వారి బాధ్యతను నిలుపుకున్నారు.          


Tags:    

Similar News