ఇంకా అంత ఎదగలేంటున్న రామ్ చరణ్

Update: 2017-01-21 08:01 GMT
స్టార్ డంను క్రమేపీ పెంచుకోవడం.. సినిమా రంగంలో ఒక్కో అడుగును వేసుకుంటూ రామ్ చరణ్ దూసుకుపోతున్న తీరు ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. స్టార్ హీరో ఇమేజ్ తర్వాత.. ఇఫ్పుడు నిర్మాతగాను తొలిసినిమాతోనే సూపర్ సక్సెస్ సాధించిన రామ్ చరణ్.. చాలా విషయాల్లో మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నాడు.

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ చాలా ప్రశ్నలకే ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. వాటిలో భాగంగా మీరు పిల్లలను ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురైంది. 'నా దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్లాడినే అనుకుంటున్నా. ఫాదర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి. నేను ఇంకా అంత ఎదగలేదని అనుకుంటున్నా' అంటూ చెర్రీ చెప్పిన ఆన్సర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

మరోవైపు మెగా ఫ్యామిలీపై వచ్చే విమర్శల విషయంలో రామ్ చరణ్ మెచ్యూర్డ్ గా ఆన్సర్ చేస్తుడడం విశేషం. తీవ్రంగా విమర్శలు చేసే ఆరోపణలకు కూడా.. ఎంతో సున్నితంగానే కాదు.. నవ్వుతూ మెగా పవర్ స్టార్ బదులు ఇచ్చేస్తున్నాడు. స్టార్ హీరోగానే కాదు.. స్టార్ ప్రొడ్యూసర్ గానూ సత్తా చాటుతున్న చెర్రీ.. ఇదే మెచ్యూరిటీని కంటిన్యూ చేస్తే.. ఫ్యూచర్ లో ఎంతో శిఖరాలు అధిరోహిస్తాడని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.  


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News