చెర్రీ కాకుంటే.. ఆ సినిమా చెడిపోయేది

Update: 2016-02-17 13:30 GMT
రామ్ చరణ్ తని ఒరువన్ రీమేక్ పట్టాలెక్కించేశాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభానికి ఇంకా గంటల వ్యవధి మాత్రమే ఉంది. నిజానికి తన మూవీస్ నిరాశపరిచిన టైంలో.. ఓ రీమేక్ చేయాలని రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం సాహసం అనాల్సిందే. గోవిందుడు అందరివాడేలే యావరేజ్ గా నిలవడం, బ్రూస్ లీ ఫ్లాప్ కావడంతో.. సేఫ్ బెట్ గా తని ఒరువన్ రీమేక్ ని ఎంచుకున్నా.. అందులోనూ కొంత రిస్క్ ఉందని చాలామంది అన్నారు.

అయితే ఈ మూవీ ఒరిజినల్ లో  హీరో జయం రవి మాత్రం.. తని ఒరువన్ రీమేక్ కి చెర్రీ కరెక్ట్ గా సూట్ అవుతాడని అంటున్నాడు. 'తని ఒరువన్ తెలుగు రీమేక్ లో రామ్ చరణ్ చేస్తున్నాడని తెలిశాక.. నేను చాలా సంతోషించా. ఈ స్టైలిష్ కేరక్టర్ కి అతను మాత్రమే సరిగ్గా సరిపోతాడు. ఈ మూవీ కాన్సెప్ట్ చెడకుండా చేయగల సత్తా చరణ్ కి మాత్రమే ఉంది' అంటూ ప్రశంసలు కురిపించాడు జయం రవి. హీరో - విలన్ మధ్య మైండ్ గేమ్ గా నడిచే ఈ మూవీలో.. హీరో ఓ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు.

తెలుగు తని ఒరువన్ రీమేక్ కి 'ధృవ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీలో.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు.
Tags:    

Similar News