బాబాయ్ - అబ్బాయ్ ల మధ్య అనుబంధం గురించి తెలిసిందే. బాబాయ్ పవన్ కల్యాణ్ అంటే చరణ్ కి ఎంతో అభిమానం. ప్రతిసారీ వీలున్న ప్రతి సందర్భంలోనూ బాబాయ్ పై చరణ్ తన ప్రేమను.. అభిమానాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ ప్రతి పుట్టినరోజున ప్రత్యేకించి చరణ్ బాబాయ్ దగ్గరకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వస్తుంటారు.
నేడు జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఆయన్ని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాబాయ్ తో కలిసి దిగిన ఫొటోలను చరణ్ తన ఫేస్ బుక్ సహా అధికారిక సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ``కల్యాణ్ బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఫ్రెండ్- మెంటర్- గైడ్‌గా ఎప్పుడూ నాతో ఉన్నందుకు థాంక్స్`` అంటూ చరణ్ ఎమోషనల్ గా వ్యాఖ్యను జోడించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం మెగాభిమానుల సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లినా ఇండస్ట్రీ వైపు నుంచి ఆయనకు ప్రముఖులు సోషల్ మీడియాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు అభిమానులు నేడు తమ దేవుడికి పూజలాచరించడం ఆసక్తి కలిగిస్తోంది. అన్నట్టు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తిరిగి ముఖానికి రంగేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఒక సెక్షన్ మీడియా విస్త్రతంగా ప్రచారం చేస్తోంది. అయితే పవన్ మాత్రం తాను ప్రజాసేవలోనే ఉండాలనుకుంటున్నానని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం? పవన్ తిరిగి నటనలోకి రావాలనుకుంటున్నారా లేదా అన్నదానిపై సరైన స్పష్ఠత లేదు. మరో ఐదేళ్ల పాటు విపక్షంలో ఉండి ప్రజా సమస్యలపైనే ఆయన పోరాడతారా? అన్నది చూడాలి.