బ్రూస్లీ రికార్డుల ఫర్వం మొదలైంది

Update: 2015-08-30 11:39 GMT
చరణ్‌ నటిస్తున్న బ్రూస్లీ ఫీవర్‌ అప్పుడే రాజుకుపోతోంది. దేశ విదేశాల్లో ఈ సినిమాకి ఫ్యాన్సీ ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే లోకల్‌ బిజినెస్‌ పూర్తయింది. ఇక గల్ఫ్‌ మార్కెట్ లోనూ బ్రూస్లీ పేరు వినగానే మైండ్‌ బ్లోవింగ్‌ బిజినెస్‌ జరిగిందక్కడ. ఇంతవరకూ అరబ్బు దేశాల్లో ఈ స్థాయి బిజినెస్‌ జరగలేదన్నది తెలుగు సినిమా ట్రేడ్‌ పండితుల వాదన.

అధికారిక ఇన్‌ ఫర్మేషన్‌ ప్రకారం .. బ్రూస్లీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లో 'బాహుబలి' రికార్డుల్ని కొట్టేశాడు. గల్ఫ్‌ మార్కెట్ లో మెగా హీరోలకు ఉన్న హవా చాలా ప్రత్యేకమైనది. అందుకే చరణ్‌ బ్రూస్లీ రిలీజ్‌ హక్కుల్ని ఓ ఆసామి ఏకంగా  47లక్షలు చెల్లించి కొనుక్కున్నాడు. అంతకంటే ముందు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రానికి 45లక్షలు చెల్లించారు. అలాగే మహేష్‌ శ్రీమంతుడు చిత్రానికి 43లక్షలు ప్రీ బిజినెస్‌ అయ్యింది. ఆ రకంగా చరణ్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌.

అయితే గల్ఫ్‌ లో చెర్రీకి ఈ రేంజు బిజినెస్‌ జరగడం వెనక అసలు సంగతులు వేరే ఉన్నాయి. ఇప్పటికే మెగా హీరోలకు అక్కడ పాపులారిటీ ఎక్కువ. పైగా యాక్షన్‌ సినిమాలకు గల్ఫ్‌ లో ఉండే గిరాకీ వేరు. బ్రూస్లీ అంటూ ఏకంగా హాలీవుడ్‌ స్టార్‌ పేరు వినిపించే సరికి ఆ రిథమ్‌కి పడిపోయారు. టీజర్‌ లోని విజువల్స్‌ కూడా స్పెల్‌ బౌండ్‌ చేసేశాయి. అందుకే ఈ స్థాయి బిజినెస్‌ జరిగిందన్నమాట! అక్టోబర్‌ 16న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు.
Tags:    

Similar News