శ్రీను వైట్ల సినిమా అంటే.. ఇలా ఉంటుంది అని ఓ మార్క్ ఉంది. ఇంటర్వెల్ తర్వాత మొత్తం యూనిట్ అంతా ఓ ఇంటికి సెట్ అయిపోవడం... అక్కడి నుంచి కన్ ఫ్యూజన్ కామెడీ, అక్కడో బకరా బ్రహ్మీ.. ఇదంతా ఓ ఫిక్సెడ్ ఫార్మాట్. ఢీ నుంచి మొదలుపెట్టి, రెడీ - నమో వెంకటేశ - దూకుడు - బాద్ షా - ఆగడు... ఇలా అన్నీ ఇదే ఫ్లోలో ఉంటాయి. దీన్నో ట్రెండ్ గా తీసేసుకుని మిగతా డైరెక్టర్లు కూడా ఫాలో అయినా... వైట్ల రేంజ్ లో తీయడం మాత్రం వాళ్ల వల్ల కావడం లేదు లెండి.
అయితే... మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో జోడీ కట్టిన వైట్ల... ఫక్తు యాక్షన్ మూవీ తీశాడేమో అనిపించింది మొదటి టీజర్ చూస్తే. మెగా క్యాంప్ మహత్యంతో తన జోనర్ లోంచి బయటకు వచ్చి ఫైటింగ్ మూవీని తీశాడేమో, అందుకే బ్రూస్ లీ టైటిల్ కే మొగ్గారు అనుకున్నారు టాలీవుడ్ జనాలు. అయితే.. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా... ఇప్పుడు సాఫ్ట్ సీన్స్ తో వచ్చిన టీజర్.. ఇలాంటి భ్రమలన్నిటినీ తొలగించేసింది. ఒకటి అరా సీన్స్ మినహా.... టీజర్ లోని సన్నివేశాలన్నీ ఒకే ఇంట్లో జరుగుతున్నవే అని అర్ధం అవుతోంది.
మొదలుపెట్టడమే హీరోని ఇంట్లోవాళ్లకి హీరో పరిచయం చేసే సీన్.. అక్కడి నుంచి మొదలయ్యే కామెడీ. ఇదంతా వైట్ల మార్క్ సీన్స్. సో... చరణ్ కూడా వైట్ల స్టైల్ కి ఓటేసినట్లే. ఇంటర్వెల్ తర్వాత ఒకే తరహా స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టిస్తున్నాడని, మొనాటనీ వచ్చేసిందనే విమర్శలు ఎన్నున్నా... శ్రీనువైట్ల తన మార్క్ ని నిలబెట్టుకుంటూనే చెర్రీతో సినిమా చేయడం హైలైట్. మొత్తానికి ఫ్యామిలీ ట్రాప్ లోకి వచ్చేశాడు చరణ్. చూద్దాం... యాక్షన్ స్టార్ బ్రూస్ లీ... ఫ్యామిలీతో ఎలాంటి రిలేషనల్ ఫైట్స్ చేస్తాడో...