రంగస్థలం రేసు నుండి తప్పుకుంది

Update: 2017-11-01 10:49 GMT
బడా సినిమాల హీరోలు షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ఒక డేట్ కు సినిమాను రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అవుతారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం అనేక కారణాల వలన రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ అవుతుంటాయి. అదే తరహాలో రంగస్థలం 1985 చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ విషయంలో చాలా సతమతమైంది. షూటింగ్ మొదలు పెట్టినప్పుడు 2018 సంక్రాంతికి పక్కా అన్నారు.

కానీ షూటింగ్ పట్టాలక్కిన తర్వాత మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో సమ్మర్ ఏప్రిల్ లో రిలీజ్ అనేశారు. ఇక అదే సమయంలో అల్లు అర్జున్ - నా పేరు సూర్యా కూడా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడంతో మళ్లీ మాట మార్చి  దానికంటే కొన్ని రోజుల ముందు తన సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. ఫైనల్ గా మార్చ్ 29న కూల్ గా రిలీజ్ చెయ్యాలని దర్శక నిర్మాతలు కూడా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అనవసరంగా తమ ఫ్యామిలీ హీరోతో ఈ రేసు ఎందుకులే అని చరణ్‌ అండ్ తన నిర్మాతలు అలా డిసైడ్ అయ్యారట.

త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలుపనుందని టాక్. ఇక ప్రస్తుతం చరణ్ - బన్నీ షూటింగ్ లకు కాస్త బ్రేక్ చెప్పి మనాలి టూర్ లో వారి సతి మణులతో హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు శిరీష్ కూడా వారితో పాటు వెళ్లి వారి పోటోలను తీస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు.  
Tags:    

Similar News