మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్ మూవీ రంగస్థలంపై అభిమానుల అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ ఫిలిం రామ్ చరణ్ కెరీర్ లోనే చాలా ప్రత్యేకం. ఇందులో మొదటిసారి పల్లెటూరి యువకుడు చిట్టిబాబు పాత్ర చేశాడు. ఇందులో చెవిటి వాడిగా కనిపిస్తూనే సౌండ్ ఇంజినీర్ ని అనే మాట చెప్పి అభిమానులను నవ్వించేశాడు.
గోదావరి తీరాన 1980 ప్రాంతంలో జరిగే కథగా రంగస్థలం తీస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్ లో సుదీర్ఘ కాలం షూటింగ్ జరిగిన సినిమాల్లో ఇదొకటి. గతేడాది ఏప్రిల్ ఈ సినిమా షూటింగ్ మొదలెట్టారు. అప్పటి నుంచి సుకుమార్ ఈ సినిమా తీస్తూనే ఉన్నాడు. రామ్ చరణ్ కూడా అతడికి సహకరిస్తూ ఇన్నాళ్లగా ఎప్పుడు కావాలంటే అప్పుడు షూటింగ్ కు అటెండవుతూ వచ్చాడు. ఎట్టకేలకు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ రోల్ కు సంబంధించి పని మొత్తం పూర్తయిపోయిందట. దీంతో చిట్టిబాబు రంగస్థలం వదిలి పూర్తిస్థాయి రంగుల ప్రపంచంలోకి వచ్చేశాడు.
రంగస్థలం తరవాత రామ్ చరణ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే బోయపాటి షూటింగ్ మొదలెట్టి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. రామ్ చరణ్ మొత్తం రంగస్థలం సినిమాకు ఇంపార్టెన్స్ ఇచ్చి అదే గెటప్ లో కంటిన్యూ అవుతూ వచ్చాడు. ఎట్టకేలకు ఆ పని పూర్తయిపోయింది రామ్ చరణ్ ఫ్రీ అయిపోయాడు కాబట్టి ఇక బోయపాటి స్పీడు పెంచడమే లేట్.