మహేష్‌ ఫెయిల్.. మరి చరణ్‌?

Update: 2016-11-06 17:30 GMT
ఈ మధ్యనే ఒక కొత్త దర్శకుడు కొత్త కథను చెప్పి.. అందులో ఒక కౌబాయ్ ఎలిమెంట్ చెప్పడంతో.. అసలు కౌబాయ్ ఎలిమెంట్ నే పూర్తిస్థాయి కతగా మర్చి తీసుకురమ్మని రామ్ చరణ్‌ చెప్పినట్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకవేళ ఆ నూతన దర్శకుడు అలాంటి కథను తీసుకొచ్చాడే అనుకుందాం.. ఫర్ సప్పోజు అనుకుందాం.. అప్పుడు మన మెగా హీరో ఆ సినిమాతో హిట్టు కొడతాడా?

అసలు మోడ్రన్ తెలుగు సినిమాల యుగంలో.. కౌబాయ్ వంటి తరహా సినిమాలు రానే రాలేదు. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్‌ బద్రి సినిమాలో ఒక పాట కోసం కౌబాయ్ గెటప్ వేసి.. అన్నయ్య చిరంజీవి కొదమసింహంను గుర్తుకుతెచ్చాడు. తరువాత తన తండ్రి బాటలో ప్రయాణిస్తూ మహేష్‌ బాబు ఏకంగా టక్కరి దొంగ అంటూ సినిమా చేశాడు. కాని రిజల్టు తేడా కొట్టేసింది.

ఇప్పుడేమో చరణ్‌ కూడా అలాంటి సినిమానే ఎటెంప్ట్ చేస్తున్నాడాయే. పైగా మహేష్‌ తరహాలో మనోడు కూడా వారసుడిగా వచ్చిన ఒక స్టార్ కిడ్. మరి టక్కరి దొంగ తరహాలో మిస్ లీడ్ చేసి ఫెయిలవుతాడా? లేకపోతే కొదమసింహం టైపులో హిట్టు కొడతాడా అనేది సాధారణంగా వచ్చే సందేహమే. చూద్దాం ఏమవుతుందో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News