నిన్న రామ్ చరణ్ కు జిమ్ లో కలిగిన గాయం వల్ల ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పూణే షెడ్యూల్ కు మూడు వారాలు బ్రేక్ ఇస్తున్న ప్రకటన రాగానే మెగా ఫాన్స్ డీలా పడిపోయారు. సినిమా కంటే ఆరోగ్యం ముఖ్యమని త్వరగా కోలుకోమని ఆకాంక్షిస్తూ మెసేజులు వెల్లువెత్తిపోయాయి. అయితే గత నెల 29న మేము వడోదర వెళ్తున్నామని టికెట్లతో సహా ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ ని హై లైట్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ టీమ్ అబద్దాలు చెబుతోందని ఓ మీడియా వర్గంలో రావడంతో మెగా ఫాన్స్ కొంత అయోమయానికి గురయ్యారు.
వెళ్ళింది వడోదర అయితే పూణే షెడ్యూల్ ఎలా వాయినా వేస్తారని వాళ్ళ లాజిక్. అయితే ఇక్కడో చిన్న పాయింట్ ఉంది. వడోదర నుంచి పూణే మధ్య దూరం 546 కిలోమీటర్లు. ఫ్లైట్ లో వెళ్తే మహా అంటే గంట ప్రయాణం. సో వడోదర నుంచి పూణేకు తరచుగానో లేదా తర్వాతనో ప్లాన్ చేయడంలో పెద్ద విశేషం లేదు
అలాంటప్పుడు ఆర్ ఆర్ ఆర్ వడోదరలో ఉంటూ పూణే షెడ్యూల్ క్యాన్సిల్ అని చెప్పడంలో లాజిక్ లేదనడం కరెక్ట్ కాదు. పైగా వడోదరలో ప్లాన్ చేసింది చిన్న పార్టట. తర్వాత పూణే షెడ్యూల్ ఎక్కువ రోజులు ఉంది. వాయిదా అని చెప్పింది దాని గురించే. క్రేజీ మల్టీ స్టారర్ కాబట్టి ఆర్ ఆర్ ఆర్ ఏ చిన్న వార్తయినా సరే సెన్సేషన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కేవలం హైప్ కోసమే రాజమౌళి టీమ్ ఇలా ప్రకటనలు ఇస్తోంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. మొత్తానికి ఇంకో నెల రోజుల దాకా ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్స్ కు తాళం పడినట్టే.