బ్యాంకాక్‌ చెక్కేస్తున్న రామ్‌ చరణ్‌

Update: 2016-03-17 13:30 GMT
అసలు ఇప్పటివరకు 'తని ఒరువన్‌' రీమేక్‌ షూటింగ్‌ గురించి మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఒక్క మాట కూడా చెప్పకపోవడం పెద్ద విశేషమే. అయితే కామ్‌ గా షూటింగ్‌ చేసుకుంటూ పోతున్న 28న తన చెల్లి  పెళ్లి సందర్భంగా బ్రేక్‌ తీసుకుంటాడని అందరికీ తెలుసు. కాకపోతే మనోడు బ్రేక్‌ తీసుకునే ముందు ఓ వారం పాటు ఒక షెడ్యూల్‌ చేసి అప్పుడు బ్రేకిస్తాడట.

మార్చి 20 నుండి బ్యాంకాక్‌ లో తని ఒరువన్‌ తెలుగు రీమేక్‌ షూటింగ్‌ జరుపుతారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బ్యాంకాక్‌ లో షూటింగ్‌ చేసేంత యాక్షన్‌ ఎపిసోడ్లు ఏమీ లేవు. ఒకవేళ తీస్తే గీస్తే ఏదైనా ప్రత్యేకమైన ఫైట్లు తీయాలి. లేదంటే.. చరణ్‌ అండ్‌ రకుల్‌ మీద ఒక బీచ్‌ సాంగ్‌ షూట్ చేస్తారేమో. ఈ షెడ్యూల్‌ లో చరణ్‌ ఒక 5 రోజులు పాల్గొని.. దాదాపు ఏప్రియల్‌ 3వ తారీఖు వరకు బ్రేక్‌ తీసుకుంటాడట.

ఏప్రియల్‌ తిరిగి షూటింగ్‌ ప్రారంభిస్తే.. అప్పటి నుండి వరుసపెట్టి రచ్చ రంబోలా అంటున్నారు. ఆగస్టు 12న సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌ తో దర్శకుడు సురేందర్‌ రెడ్డి అండ్‌ నిర్మాత అల్లు అరవింద్‌ మాంచి ప్లానింగ్‌ తో దూసుకుపోతున్నారని టాక్‌.
Tags:    

Similar News