రామ్ చరణ్ రెండు వారాలు అక్కడే..

Update: 2018-05-06 16:17 GMT
‘రంగస్థలం’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రం నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టి ఐదో వారంలోనూ చెప్పుకోదగ్గ వసూళ్లతో సాగుతోంది. ఈ చిత్రం విడుదల కావడానికంటే ముందే చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బోయపాటి ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తి చేశాడు. రెండో షెడ్యూళ్లో చరణ్ పాల్గొని ఇంటర్వెల్ ఫైట్ తో పాటుగా మరి కొన్ని కీలక సన్నివేశాల్లోనూ నటించినట్లు సమాచారం. హైదరాబాద్ లో పూర్తయిన ఈ షెడ్యూల్ తర్వాత తదుపరి షెడ్యూల్‌ మే 12 నుంచి బ్యాంకాక్‌ లో జరగనుంది. అక్కడే రెండు వారాల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. చరణ్ అండ్ టీమ్ ఇంకొన్ని రోజుల్లోనే అక్కడికి బయల్దేరనున్నారు.

దీనిపై నిర్మాత దానయ్య మాట్లాడుతూ ‘‘చరణ్-బోయపాటి కాంబినేషన్ అంటే సినిమాపై ఎన్ని అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు దీటుగా సినిమాను రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లో మేజర్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. రామోజీ ఫిలిం సిటీలో ఫ్యామిలీ సీన్స్.. అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్‌ ఎపిసోడ్‌ పూర్తి చేశాం. ఈ 20 రోజుల షెడ్యూల్‌లో రామ్‌ చరణ్‌.. ప్రశాంత్‌.. స్నేహ.. కియారాలతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించారు. అంతుకు ముందుకు చిత్రీకరించిన 15 రోజుల షెడ్యూల్‌లో వివేక్‌ ఒబెరాయ్‌ సహా ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్‌ కోసం యూనిట్‌ బ్యాంకాక్ వెళుతోంది. ఈ షెడ్యూల్‌ 15 రోజుల పాటు సాగుతుంది. మెగాభిమానులు.. ప్రేక్షకులను అలరించేలా రామ్‌ చరణ్‌ ను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్‌ చేస్తున్నారు బోయపాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎలిమెంట్ స్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ గా సినిమాను రూపొందిస్తున్నాం’’ అని అన్నారు.

Tags:    

Similar News