రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలున్న ఈ చిత్రం తనదైన శైలిలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడని ట్రైలర్ మరియు టీజర్ లను చూస్తుంటేనే అనిపిస్తుంది. రామ్ చరణ్ ను ఈ చిత్రం కోసం బోయపాటి చాలానే కష్టపెట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీనులు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
చరణ్ మాట్లాడుతూ.. బోయపాటి గారు నాకు ఈ కథను మూడు సంవత్సరాల క్రితం చెప్పారు, కథ చెప్పినప్పుడే నా పాత్ర గురించి టాటూలతో సహా క్లారిటీగా చెప్పారు. సబ్జెక్ట్ లో ఎలాంటి మార్పులు అవసరం లేకుండా, ముందే అంతా పక్కాగా ప్లాన్ చేశారు. ఎమోషన్స్ ను తన సీన్స్ లో చూపించడంలో బోయపాటి గారు నెం.1 డైరెక్టర్. యాక్షన్ సీన్స్ అనేది ఆయనకు గోలీలాటలా చాలా సులభం. ఆయన సినిమాల్లో నాకు ఎమోషనల్ డ్రామా మరియు కంటెంట్. నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. రంగస్థలం కోసం నేను కాస్త బరువు తగ్గాను. నెల రోజుల్లో బాడీ పెంచాలని అన్నారు. నెల రోజుల్లో ఎలా అవుద్దండని నేనంటే - మీరు చేయగలరు - మీరు చేస్తారని నాలో నమ్మకం కలిగించారు.
బోయపాటి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో నాకంటే మేధావులు ఎంతో మంది ఉంటారు. కాని అందరికి గుర్తింపు రాదు. కాని ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. అందుకోసం పరిగెత్తితే పని కాదు, ప్రతి సినిమా జాగ్రత్తగా చేయాలి. సినిమా చేస్తున్నప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వందల మంది ఉంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ద చూపను. నన్ను నమ్ముకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకూడదు. అందుకే టైం తీసుకుని మరీ సినిమా చేస్తాను. నా ప్రతి సినిమాలో కూడా హ్యూమన్ ఎమోషన్స్ చూపిస్తాను. తెలుగు వారి బ్లడ్ లోనే హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. అందుకే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తన సీన్స్ లో హ్యూమన్ ఎమోషన్స్ ఉండేలా జాగ్రత్త పడతానన్నాడు.
Full View