గాంధీతో రామ్ చరణ్‌.. సెట్ అయిందా?

Update: 2017-02-02 04:51 GMT

సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. శర్వానంద్ మూవీ ఎక్స్ ప్రెస్ రాజాతో ఇండస్ట్రీని ఆకట్టుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. ఇప్పుడీ డైరెక్టర్ రామ్ చరణ్ తో జత కట్టే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో తెగ మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయట కూడా.

రీసెంట్ గా సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేసిన చెర్రీ.. ఇది కాకుండా మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యానని ఇప్పటికే చెప్పాడు. వీటిలో కొరటాల శివతో ఓ సినిమా దాదాపు ఖాయం అయినట్లే. మరో ప్రాజెక్ట్ డీటైల్స్ ఇంకా రివీల్ కాలేదు కానీ.. ఇప్పుడు మేర్లపాక గాంధీతో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయట. మొదట చరణ్ కి ఓ లవ్ స్టోరీ వినిపించాడట మేర్లపాక. అది బాగానే నచ్చినా.. వేరే లైన్ పై వర్క్ చేశారట ఇద్దరూ. లవ్ స్టోరీకి మరో విభిన్నమైన యాంగిల్ ని మిక్స్ చేసిన కాన్సెప్ట్ కి.. మెగా పవర్ స్టార్ ఫ్లాట్ అయ్యాడని తెలుస్తోంది.

అలా చరణ్-మేర్లపాక గాంధీ సబ్జెక్ట్ ఫైనల్ అయినట్లుగా చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్-శర్వానంద్ లు ఇద్దరు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. గాంధీ దగ్గర ఉన్న కథ.. చరణ్ కు సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశ్యంతో.. స్వయంగా శర్వానే చరణ్ తో మీటింగ్ ఏర్పాటు చేసి మరీ.. ఈ సబ్జెక్ట్ గాడిలో పడేందుకు కారణం అయినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News