చరణ్ కూడా గెటప్ మార్చేశాడే..

Update: 2016-01-21 07:36 GMT
తన రీఎంట్రీ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి పెంచిన మీసం గురించి మూణ్నాలుగు రోజులుగా టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. చిరు మీసకట్టు సింప్లీ సూపర్బ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇలా లుక్, గెటప్ విషయంలో కొంచెం వెరైటీగా ఏదైనా చేస్తే తప్ప ప్రస్తుత ట్రెండులో జనాల దృష్టిని ఆకర్షించడం.. సినిమాకు క్రేజ్ తీసుకురావడం కష్టం. ‘నాన్నకు ప్రేమతో’ విషయంలో జనాల్లో ఆసక్తి మొదలవడానికి ఎన్టీఆర్ నయా లుక్ ప్రధాన కారణం. అందుకే చిరు తనయుడు రామ్ చరణ్ కూడా తన కొత్త సినిమా కోసం లుక్ మారుస్తున్నాడు. గత కొన్ని రోజులుగా బయటెక్కడా కనిపించని చరణ్.. ఇటీవల కార్ లో వెళ్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ సందర్భంగా చరణ్ ఫ్రెంచ్ కట్ పెంచడం జనాల కళ్లల్లో పడింది. హేర్ కట్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది.

‘తనీ ఒరువన్’ రీమేక్ లో చేయబోయేది పోలీస్ క్యారెక్టర్ కాబట్టి చరణ్ జుట్టు బాగా కత్తిరించుకోవడం ఖాయం. ఫిట్ నెస్ విషయంలోనూ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మొత్తంగా చరణ్ ఓ కొత్త లుక్ తో కనిపించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10న ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. హీరోయిన్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ.. షూటింగ్ మొదలయ్యే ముందు ప్రెస్ నోట్ ద్వారా విషయం వెల్లడిస్తారట. విలన్ పాత్ర మాత్రం అరవింద్ స్వామే చేయబోతున్నాడు. తమిళ కథాకథనాల్లో పెద్దగా మార్పులేమీ చేయట్లేదని.. చరణ్, సురేందర్ రెడ్డి ఒరిజినల్ నే ఫాలో అయిపోవాలని భావిస్తున్నారని సమాచారం.
Tags:    

Similar News