ఆ బట్టలు చరణే కుట్టించాడు

Update: 2018-03-26 05:07 GMT
మెగా పవర్ స్టార్ ఇచ్చే సిగ్నేచర్ పోజులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మెగాస్టార్ టైం నుంచి ఇలా సినిమాకో సిగ్నేచర్ పోజుతో అలరించడం అనే ట్రెండ్ ఉంది. ఇప్పుడు రంగస్థలం విషయంలో కూడా ఓ సిగ్నేచర్ పోజ్ వైరల్ గానే స్ప్రెడ్ అవుతోంది.

ఎర్ర బనియన్.. గళ్ల లుంగీ.. చెక్స్ షర్ట్.. చేతిలో తువ్వాలు.. వీటితో రామ్ చరణ్ ఇచ్చిన స్టిల్ బాగా మెప్పించింది. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్.. అచ్చు చెర్రీ మామ మాదిరిగా డ్రెసింగ్ చేసుకున్న ఫోటో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్వయంగా అల్లు అర్జున్ ఈ ఫోటోను పోస్ట్ చేసి మరీ.. రంగస్థలం పాటలతో అయాన్ తన చెవులు హోరెత్తించేస్తున్నాడని చెప్పాడు. ఇప్పుడీ ఫోటో వెనక మరిన్ని కబుర్లు చెబుతున్నాడు మెగా పవర్ స్టార్. రంగస్థలం ఆడియో సాంగ్స్ తో అలరిస్తున్న టైంలోనే.. ఓ రోజన చెర్రీకి బన్నీ ఫోన్ చేసి.. అయాన్ ను మీ ఇంటికి పంపిచేస్తున్నా అన్నాడట.

'రంగస్థళం పాటల దెబ్బకి నా రెండు చెవులు పగిలిపోతున్నాయి. ఇక నా వల్ల కాదు. వీడిని మీ ఇంటికి పంపిచేస్తున్నా అని చెప్పాడు. అంతే అపుడు నాకు వచ్చిన ఆలోచనతో.. తను మా ఇంటికి వచ్చేలోగా 2 జతలను కుట్టించి రెడీగా ఉంచాను. తను రాగానే స్వయంగా నేనే అయాన్ కి ఇచ్చాను' అంటూ ఆ డ్రెస్సు వెనుక కథ చెప్పాడు రాం చరణ్ తేజ్.        
Tags:    

Similar News