30 సెకన్ల కోసం చాలా టేక్స్ తినేశా

Update: 2017-01-06 07:20 GMT

రామ్ చరణ్ చాలాకాలం తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టాడు. ధృవ మూవీతో మెగా పవర్ స్టార్ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. అటు ఓవర్సీస్ లోను సత్తా చాటలేకపోయాడన్న విమర్శలకు చెక్ చెప్పాడు. కమర్షియల్ థ్రిల్లర్ ను తీసి ఆడియన్స్ ను మెప్పించడం.. విమర్శకులను మెప్పించడం.. అన్నీ కలిపి సక్సెస్ సాధించడం సాధ్యమేనని ధృవతో ప్రూవ్ చేశాడు చెర్రీ.

ప్రస్తుతం మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150కి ప్రొడ్యూసర్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు ప్రీరిలీజ్ ఫంక్షన్.. ఇటు రిలీజ్ ఏర్పాట్లను చూసుకుంటూనే.. మధ్యమధ్యలో ఖైదీ ప్రమోషన్స్ ను కూడా హ్యాండిల్ చేస్తున్నాడు. మెగాస్టార్ తో చేసిన కేమియో గురించి చెర్రీ చెప్పిన సంగతులు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 'నాది ఈ సినిమాలో 30 సెకన్ల కేమియో మాత్రమే. నాన్నతో కలిసి నటించడం అనే ఎక్స్ పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కెమేరా ముందుకు వచ్చేసరికి ఆయన మెగాస్టార్ అయిపోతారు. ఆయన్ని చూస్తూ మనల్ని మనం మర్చిపోతాం. నేను ఆ 30 సెకన్ల కేమియో పూర్తి చేయడానికి చాలా టేకులు పట్టింది' అంటూ నవ్వేశాడు చెర్రీ.

ఇప్పటివరకూ కమర్షియల్ మూవీలు వస్తున్న ఫార్మాట్ కు భిన్నమైన రూట్ లో ప్రయాణించాలని అనుకుంటున్నట్లు చెప్పిన రామ్ చరణ్.. కమర్షియల్ మూవీకి కొత్త అర్ధం చెప్పాలని భావిస్తున్నానని అన్నాడు. తాను సైన్ చేసిన మూడు సబ్జెక్టులు ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటూనే.. తన టేస్ట్ కి తగ్గట్లుగా ఉంటాయని చెబుతున్నాడు రామ్ చరణ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News