మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలలో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉన్నాయని ప్రాధమిక సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ స్పందన చూసిన 'సైరా' టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా 'సైరా' నిర్మాత రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తన స్పీచ్ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదని ప్రారంభిస్తూ మొదట పరుచురి బ్రదర్స్ ను తమ గురువులుగా పేర్కొంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తను కూడా 'RRR' షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చిందని ఇలాంటి సమయంలో హనీ అక్క.. విద్య అక్క తనకు బ్యాక్ బోన్ గా నిలిచారని వారికి థ్యాంక్ యూ చెప్పారు. సీనియర్ హీరో జగపతి బాబుపై కూడా చరణ్ పొగడ్తలు కూరిపించారు. జగపతి బాబు ఒక వండర్ఫుల్ పర్సన్ అని తనకు చాలామంది చెప్పారు.. వారు చెప్పినదానికంటే పది రెట్లు వండర్ఫుల్ పర్సన్ అని జేబీపై తన అభిమానం ఎలాంటిదో చెప్పారు చరణ్.
నిర్మాతగా వ్యవహరించడం అంత సులువు కాదని చెప్పకనే చెప్పారు. పోయిన నెలలో నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచేవాడినని.. అలా ఎందుకు లేచేవాడినో తనకు తెలియదని.. ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలందరికీ ఇలాంటి పరిస్థితే ఉంటుందేమో అని చెప్పడంతో పక్కనే ఉన్న దిల్ రాజు పెద్దగా నవ్వేశారు. గతంలో రాజమౌళి గారు చెప్పినట్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆశిస్సులు తమపై ఉన్నాయని అన్నారు. ఈ సినిమాకోసం సురేందర్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని.. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలని చెప్పారు. తమన్నా నాకు ఫేవరెట్ యాక్టర్ అని చెప్తూ మిల్కీ బ్యూటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 'సైరా' సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పిన చరణ్.. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కూడా థ్యాంక్స్ చెప్పారు.