బేసిగ్గా లెక్కల మాస్టారయిన సుకుమార్ వేసిన షూటింగ్ లెక్క తప్పినట్టే కనిపిస్తోంది. మెగా హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న రంగస్థలం 1985 సినిమాను ముందుగా అనుకున్న లెక్కల ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి థియేటర్లకు తీసుకురావాలని భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల ఇంకాస్త జాప్యం కానుందనే మాట వినిపిస్తోంది.
పీరియాడికల్ మూవీగా రంగస్థలం తెరకెక్కుతోంది. ఇందులో అక్కినేని వారింటి కొత్తకోడలు సమంత అచ్చమైన పల్లెపడుచుగా కనిపించబోతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ గెడ్డం పెంచి కొత్తలుక్ లో కనిపిస్తున్నాడు. జనవరికి ఈ సినిమా థియేటర్లకు తెద్దామని చిత్ర యూనిట్ అనుకున్నా షూటింగ్ ఇంకా కొలిక్కి రాకపోవడంతో సమ్మర్ కు ముందుగా మార్చి 30 నాటికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనేది టాలీవుడ్ లో లేటెస్ట్ టాక్. దీనికితోడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాను సంక్రాంతికి థియేటర్లకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బాబాయ్ - అబ్బాయ్ ల మధ్య పోటీ ఎందుకని రంగస్థలం యూనిట్ మార్చి రిలీజ్ వైపు మొగ్గు చూపుతోందనేది టాక్.
ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేస్తూనే తండ్రి చిరంజీవి 151వ సినిమా సైరా.. నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు రామ్ చరణే నిర్మాత కావడంతో కాస్టింగ్ నుంచి టెక్నీషియన్స్ వరకు అన్నీ స్వయంగా చూస్తున్నాడు. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో సైరా.. నరసింహారెడ్డిని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.