మన టాలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ ను మాత్రమే కాకుండా ఇతర భాషల మార్కెట్ పై కూడా ఈమధ్య ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్.. ప్రభాస్ లాంటి హీరోలు కేరళలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక తమిళ మార్కెట్ పై మహేష్ లాంటి హీరోలు ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చరణ్ కూడా ఇతర భాషలలో తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు జనవరిలో మలయాళం ప్రేక్షకులను పలకరించనున్నాయి. చరణ్ సూపర్ హిట్ సినిమా 'రంగస్థలం' మలయాళం వెర్షన్ జనవరి 18 న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకు.. అంటే జనవరి 25 న చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' రిలీజ్ కానుంది. 'వినయ విధేయ రామ' జనవరి 11 న సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు వారాల గ్యాప్ లో మలయాళం రిలీజ్ ఉంటుందన్న మాట.
వారం గ్యాప్ లో రెండు సినిమాల రిలీజులంటే అంది కేరళలో ఉండే చరణ్ ఫ్యాన్స్ కు ట్రీట్ లాంటిదే. మరి అల్లు అర్జున్ బాటలోనే చరణ్ కూడా అక్కడి ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తాడా లేదా వేచి చూడాలి.
Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?