రంగస్థలం బిజినెస్ క్లోజ్!!

Update: 2018-02-06 14:14 GMT
రామ్ చరణ్ కెరీర్ లోనే ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న రంగస్థలం సినిమాపైనే అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే. సినిమా గురించి చిన్న విషయం బయటకి వచ్చినాసరే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సినిమా కాన్సెప్ట్ గురించి బయటకి ఎప్పుడైతే రూమర్స్ వచ్చాయో అభిమానులు సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. దీంతో బిజినెస్ కూడా అప్పుడే మొదలైంది.

దాదాపు అన్ని ఏరియాల్లో సినిమా మంచి ధరకే అమ్ముడు పోయింది. కేవలం ఆంధ్ర మాత్రమే ఉంది. చూస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ లాభాలను గట్టిగానే అందుకేనట్లు కనిపిస్తోంది. ఎక్కువగా నైజం లో రూ.18 కోట్లకు అమ్మేశారు. రెండు కోట్లను మాత్రం రిటర్న్ గ్యారెంటీ పెట్టారు. మొదటి సారి యూవీ క్రియేషన్స్ నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ బిజినెస్ ని రీసెంట్ గా క్లోజ్ చేశారు.  సీడెడ్ - బళ్లారి కలిపి 12.06 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే సాయి కొర్రపాటి బళ్లారి హక్కులను దక్కించుకున్నాడు.

శాటిలైట్ - ఓవర్సీస్ - డిజిటల్ ఇలా అన్ని బిజినెస్ లలో మైత్రి మూవీ మేకర్స్ బిజినెస్ క్లోజ్ చేసి మొత్తం డబ్బును అందుకుంది. అయితే కేవలం ఆంధ్ర ఏరియా లో కొంచెం ధరపై పై చర్చలు సాగుతుండడం వల్ల ఆలస్యం అవుతోంది. రేపో మాపో అది కూడా సెట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు పెట్టింది మీడియం బడ్జెట్ అయినప్పటికీ లాభాలను భారీ బడ్జెట్ కు పెట్టినట్లు అందుకుంటోంది. మరి బయ్యర్స్ కి ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.   



Tags:    

Similar News