రంగస్థలాన్ని చెక్కుతూనే ఉంటారా?

Update: 2018-03-01 11:39 GMT
ఈ రోజు నుంచి లెక్కబెట్టుకుంటే రంగస్థలం విడుదలకు సరిగ్గా 29 రోజులు మాత్రమే ఉంది. ధృవ తర్వాత రామ్ చరణ్ సినిమా వచ్చి ఒక సంవత్సరం రెండు నెలలు దాటింది. ఇప్పటిదాక జరిగిన ఆలస్యానికే చరణ్ ఫాన్స్ కొంత అసహనంతో ఉన్నారు. కాని అవుట్ పుట్ పట్ల ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పాజిటివ్ గానే ఉండటంతో సర్దుకుంటూ వచ్చారు. తీరా రిలీజ్ డేట్ మెడ మీద కత్తిలా వేలాడుతూ ఉంటే ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉండటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎప్పుడో గుమ్మడి కాయ కొట్టాల్సిన సినిమాని ఇంకా తీస్తున్నారు అంటే అసలు ఏం జరిగింది అనే చర్చ ఊపందుకుంది. నిన్న కూడా హైదరాబాద్ లో చరణ్ పాల్గొన్న కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ రోజు రేపు మినహాయించి మళ్ళి ఎల్లుండి నుంచి కంటిన్యూ చేయబోతున్నారట. పెద్ద షెడ్యూల్ కాదు కాని చిన్న చిన్న సీన్స్ పెండింగ్ లో ఉన్నాయట.

ఏడాదికి పైగా షూటింగ్ లో ఉన్న రంగస్థలం ముందు ఆనుకున్న తేది గత ఏడాది దసరా. సరే మిస్ అయ్యింది సంక్రాంతి అనుకున్నారు. అప్పటికీ పూర్తి కాకపోవడంతో బాబాయ్ అజ్ఞాతవాసితో వచ్చాడు. సరే అయితే అయ్యిందిలే మార్చ్ లో ఎవరు ఉండరు కదా అనుకుంటే ఇంకా సాగుతూనే ఉన్న షూటింగ్. మరో మూడు నాలుగు రోజులలో గుమ్మడి కాయ కొట్టేస్తారు అంటున్నా ప్లానింగ్ లో ఎక్కడ లోపం జరిగిందో మాత్రం చెర్రి ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. తన ప్రతి సినిమా విషయంలోనూ ఇదే రిపీట్ అవుతోంది. రానున్న బోయపాటి శీను మూవీ - తారక్-జక్కన్న కాంబోలో స్టార్ట్ కాబోతున్న మల్టీ స్టారర్స్ తో డైరీ  మామూలు బిజీగా ఉండేలా లేదు.సో చరణ్ కాస్త ఫోకస్ పెంచడం బెటర్.

రేపు టైటిల్ సాంగ్ ఆడియో విడుదల చేయనున్న సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ గా చేయించిన మేకింగ్ వీడియో ఇప్పటికే ఉన్న అంచనాలు పెంచేసింది. పక్కా మాస్ బీట్ తో నిజమైన డప్పు కళాకారులను తీసుకొచ్చి మరీ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నట్టు తెలిసింది. బాలన్స్ త్వరగా పూర్తి చేసి త్వరగా ప్రమోషన్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. సమ్మె తర్వాత విడుదల కాబోయే భారీ చిత్రం ఇదే అయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News