ఒక స్టార్ హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు.. అందరి దృష్టి రికార్డుల మీదే ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ మొదటి రోజు కలెక్షన్స్ రికార్డుల దగ్గర నుండి మొదలుపెట్టి అన్ని రికార్డులు తమ హీరో పేరిటే ఉండాలనుకుంటారు. దీంతో ఫిలిం మేకర్స్ ఫేక్ కలెక్షన్స్ తో పోస్టర్లు వేయడం.. ప్రచారం చేయడం కూడా కామన్ అయిపోయింది. పోయినేడాది 'భరత్ అనే నేను'.. 'నా పేరు సూర్య' కలెక్షన్స్ విషయంలో ఎంత హంగామా జరిగిందో అందరికీ తెలిసిందే.
'భరత్ అనే నేను'.. 'రంగస్థలం' సినిమాలకు ఒకే ప్రొడ్యూసర్ అయినా ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ మధ్యలో సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరిగింది. ఇక 'నా పేరు సూర్య' డిజాస్టర్ గా నిలిచినా హిట్ అంటూ ఫేక్ కలెక్షన్స్ ప్రకటించడం కూడా విమర్శలకు దారి తీసింది. అప్పట్లోనే చరణ్ ఫేక్ కలెక్షన్స్ పై మాట్లాడుతూ అసలు కలెక్షన్ ఫిగర్స్ ను పోస్టర్లపై వేయడం మానేయాలన్నాడు. రీసెంట్ గా 'వినయ విధేయ రామ' ప్రమోషన్స్ లో కూడా మరోసారి ఫేక్ కలెక్షన్స్ పై స్పందించాడు చరణ్.
ఈ జెనరేషన్ హీరోలెవ్వరూ ఈ రికార్డులగురించి పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు. "నేనైతే రికార్డుల గురించి పట్టించుకోను.. నా సినిమా పోస్టర్లపై కలెక్షన్స్.. రికార్డులు వేయకండి అని నిర్మాతలకు చెప్పా. కావి వేయాలో వద్దో నిర్ణయించుకావలసింది మాత్రం వాళ్ళే" అంటూ బాల్ ను నిర్మాతల కోర్టులోకి వేశాడు. అయినా వసూళ్ళ గురించి చెప్పుకుంటే కొత్త తలనొప్పులు వస్తుంటాయి అంటూ ఇన్కమ్ టాక్స్ వారి గురించి ఇండైరెక్ట్ గా ప్రస్తావించాడు. తన సినిమాకు నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు లాభపడితే సంతోషిస్తానని.. అంతకు మించి కలెక్షన్స్ విషయం ఆలోచించనని తెలిపాడు.
అంతా బాగానే ఉంది గానీ చరణ్ లాంటి స్టార్స్ గట్టిగా ఫేక్ కలెక్షన్ పోస్టర్లు వేయోద్దని నిర్మాతలకు గట్టిగా చెప్తే ఈ చెడు ధోరణి ఆగే అవకాశం ఇంది. అలా కాకుండా కలెక్షన్స్ ప్రకటించే విషయం నిర్మాతల ఇష్టం అంటే ఇక ఈ ఫేక్ కలెక్షన్స్ హంగామా ఆగేదేప్పుడు?
Full View