స్టంట్స్-రిస్కులు బాగా పెరిగాయమ్మా

Update: 2016-09-17 07:30 GMT
రామ్ చరణ్ కి  మెయిన్ స్ట్రెంగ్త్ యాక్షన్ సీక్వెన్స్ లు. అరంగేట్రం నుంచి ఇప్పటివరకూ ఈ జోనర్ లో తనను మ్యాచ్ చేయడం అనిపించే రేంజ్ లో.. అదిరిపోయే స్టంట్స్ చేసి. ఫ్యాన్స్ ని అలరించేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. కమర్షియల్ మూవీస్ లో యాక్షన్ పార్ట్ ను ఇరగదీసే రామ్ చరణ్.. ఇప్పుడు ఏకంగా స్టైలిష్ కాప్ యాక్షన్ చిత్రం ధృవ చేస్తున్నాడు. మరి ఇందులో మెగా పవర్ స్టార్ ఎన్ని విన్యాసాలు చూపించబోతున్నాడో అనిపించడం సహజమే.

ధృవలో రామ్ చరణ్ బోలెడన్ని రిస్కీ స్టంట్స్ చేసేస్తున్నాడట. కనీసం డూప్ ని కూడా పెట్టుకోకుండా చెట్లు పుట్టలు అన్నీ ఎక్కేస్తున్నాడని అంటున్నారు. ఓ ఫారెస్ట్ ఎపిసోడ్ లో ఓ పెద్ద చెట్టును అలవోకగా చరణ్ ఎక్కేస్తున్న వీడియో క్లిప్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అయిపోతోంది. షూటింగ్ స్పాట్ నుంచి మొబైల్ లో తీసిన ఈ వీడియో క్వాలిటీ తక్కువగా ఉన్నా.. రామ్ చరణ్ ని చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఇంత కమిటెడ్ గా యాక్షన్ పార్ట్ ను చరణ్ తప్ప ఇంకెవరూ చేయలేరని చెప్పేసుకుంటున్నారు.

ఇక దసరాకి విడుదల కావాల్సిన ధృవ.. డిసెంబర్ 17కి వాయిదా పడింది. విలన్ రోల్ లో నటిస్తున్న అరవింద్ స్వామికి హెల్త్ ప్రాబ్లెమ్స్ రావడమే ఇందుకు కారణం అంటున్నారు.
Tags:    

Similar News