మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న నెక్ట్స్ మూవీ తని ఒరువన్ రీమేక్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ చేయకుండా, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండానే రిలీజ్ డేట్ అనుకుంటున్నారా? అది వాస్తవమే అయినా, రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేశారన్నది కూడా ఇంకా పెద్ద వాస్తవం.
గతంలో బ్రూస్ లీ మూవీని కూడా ఇలాగే రిలీజ్ డేట్ ఇచ్చి మరీ స్టార్ట్ చేశాడు రామ్ చరణ్. చెప్పినట్టుగానే చెప్పిన డేట్ కి థియేటర్లలో లాంఛ్ చేశాడు. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కి కూడా అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. అందుకే తని ఒరువన్ రీమేక్ ని ఏ డేట్ కి రిలీజ్ చేయాలో నిర్ణయించేశారు. ఆగస్ట్ 12న ఈ మూవీని థియేటర్లలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు యూనిట్. ఈసారి ఆగస్ట్ 15 సోమవారం రావడంతో.. వీకెండ్ మరో రోజు కలిసి రానుంది. ఇదే డేట్ కి ఫిక్స్ అయేందుకు ఇది కూడా ఒక రీజన్ అని చెప్పాలి. అయితే.. తనీ ఒరువన్ రీమేక్ ని ఫిబ్రవరిలో స్టార్ట్ చేయనున్నారు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుంది.
80 నుంచి 90 రోజుల పాటు షూటింగ్ చేసి, దీన్ని ఫినిష్ చేయనున్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఓ ఐపీఎస్ ఆఫీసర్ కి, రాజధానిలో వ్యవస్థాగతంగా క్రైమ్స్ చేసే వ్యక్తికి మధ్య నడిచే గేమ్ ప్లాన్ ని బేస్ చేసుకుని ఈ మూవీ నడుస్తుంది. ఈ ఇంటెలిజెంట్ గేమ్ కు తమిళనాట సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే ఈ స్టోరీ - స్క్రీన్ ప్లేలో మార్పులు చేయాల్సిన పని లేదని, యాజిటీజ్ గా తీసేయమని చిరు చెప్పడంతో, స్క్రిప్ట్ వర్క్ ని ఫినిష్ చేశారు సురేందర్ రెడ్డి అండ్ టీం.