చెర్రీ సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు..

Update: 2016-02-18 07:58 GMT
రామ్ చరణ్ గత నాలుగు నెలలుగా ఓ మూవీ షూటింగ్ లోనూ పాల్గొనలేదు. గతేడాది అక్టోబర్ లో దసరా పండుగ సీజన్ కి బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచి మరో సినిమా స్టార్ట్ చేయకపోయినా.. చెర్రీ చేయబోయే తర్వాతి మూవీ ఏంటో ముందే తెలిసిపోయింది. కోలీవుడ్ మూవీ తని ఒరువన్ ని రీమేక్ చేస్తున్నట్లు చరణ్ కానీ, అల్లు అరవింద్ యూనిట్ కానీ చెప్పకపోయినా.. ఈ విషయం లీక్ అయిపోయింది.

అయితే.. ప్రాజెక్ట్ కన్ఫాం అయినా.. షూటింగ్ స్టార్ట్ కాకపోవడం పలు అనుమానాలకు ఛాన్స్ ఇచ్చింది. అలాంటి వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇప్పుడు మూవీ షూటింగ్ ని ప్రారంభిస్తూ పూజ చేసేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు మిగిలిన యూనిట్ అంతా ఈ పూజలో పాల్గొన్నారు. అయితే.. రామ్ చరణ్ మాత్రం తన సోదరి పెళ్లిపనుల్లో ఉండడంతో ఈ పూజా కార్యక్రమానికి హాజరు కాలేదు. తని ఒరువన్ రీమేక్ ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనుండగా.. గీతా ఆర్ట్స్  బ్యానర్ లై అల్లు అరవింద్ నిర్మించనున్నారు.

హీరోయిన్ గా పలు ఆప్షన్స్ తర్వాత.. మళ్లీ బ్రూస్ లీ హీరోయిన్ రకుల్ తోనే జత కట్టాలని చెర్రీ డిసైడ్ అయ్యాడు. హిప్ హాప్ తమీజాలు సంగీతం అందిచనున్న ఈ మూవీకి.. 'రక్షక్' - 'ధృవ' అనే టైటిల్స్ అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే మూవీ యూనిట్ మాత్రం ఇప్పటివరకూ టైటిల్ విషయంలో ఆలోచన కూడా లేదని చెబుతోంది.
Tags:    

Similar News